
తాజా వార్తలు
ప్లాస్మా దానానికో యాప్
దిల్లీకి చెందిన కాశికా ప్రజాపత్ ఐఐటీ విద్యార్థిని. ఈమె రూపొందించిన ప్లాస్మా బ్యాంక్ యాప్ కొపాల్19 సాయంతో కరోనా బాధితులకు సరిపోయే ప్లాస్మా దాతను గుర్తించొచ్ఛు తొలుత ఆమె వైద్య సౌకర్యాలను రోగులకు తెలియజేసే ట్రాకర్ యాప్‌ను అభివృద్ధి చేయాలనుకుంది. ఇందులో భాగంగా దిల్లీలోని పలు ఆసుపత్రుల్లోని పడకలు, వెంటిలేటర్స్, ఇతర సదుపాయాల వివరాలను యాప్ ద్వారా రోగులకు అందించాలని భావించింది. ఈ పనిమీదే ఎయిమ్స్‌లో తనకు తెలిసిన వైద్యుడిని కలిసింది. ఆయన ద్వారా.. ప్లాస్మా దాతలను సంప్రదించడం కష్టమవుతోందని తెలుసుకుంది. దీంతో ప్లాస్మా బ్యాంకు యాప్ తయారీకి నడుం బిగించింది కాశికా. ‘రోగులకు, దాతలకు అనుసంధానంగా దీన్ని తీర్చిదిద్దాలనుకున్నా.‘ప్లాస్మా దానంతో.. ఓ జీవితాన్ని కాపాడండి’ అనే క్యాప్షన్‌తో కొపాల్19 యాప్‌ను తయారు చేశాన’ని చెబుతోంది కాశికా. కొపాల్19 యాప్‌లో ఆసక్తి ఉన్న దాతలు వారి పేరు, మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, బ్లడ్‌గ్రూపు, వారు చికిత్స తీసుకున్న ఆసుపత్రి, వైద్యుల వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. వ్యాధి ఎప్పుడు తగ్గింది, ఏమైనా లక్షణాలున్నాయా లాంటి ముఖ్యమైన సమాచారాన్ని యాప్‌లో పొందుపరచాలి. వీటి ఆధారంగా సదరు వ్యక్తి ప్లాస్మా దానానికి అర్హుడా కాదా అనేది వైద్యులు నిర్ణయిస్తారు. అవసరమైనప్పుడు దాతను సంప్రదిస్తారు. దాతే స్వయంగా వచ్ఛి. ప్లాస్మాను దానం చేయొచ్ఛు వారు చేరుకోలేని పరిస్థితిలో ఆ సమాచారం మరో వ్యక్తికి వెళుతుంది. నెల రోజుల్లోనే ఈ యాప్ తయారు చేసిందామె. ‘ప్రస్తుతానికి ఈ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులో ఉంది. యాప్ అభివృద్ధిలో తుషార్ చౌధురి, తనయ్ అగర్వాల్, ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ అభినవ్ సింగ్ వర్మ, వరిధ్ కాటియార్ల సహకారం మరవలేనిది’ అని చెబుతోంది కాశికా.