
తాజా వార్తలు
వంటింట్లో 14 నాగుపాము పిల్లలు
పట్టుకున్న నాగుపాము పిల్లలు
భువనేశ్వర్ అర్బన్: జాజ్‌పూర్ జిల్లా సారంగపూర్ గ్రామంలోని ఓ వ్యక్తికి చెందిన ఇంటి వంట గదిలో 14 నాగుపాము పిల్లలను పట్టుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పద్మలోచన మహింది అనే వ్యక్తి ఇంటి వంట గదిలో నాగుపాము సంచరిస్తున్నట్లు గుర్తించి కుటుంబ సభ్యులు వెంటనే ఇంటి బయటకు పరుగులు తీశారు. వారు స్నేక్హెల్పలైన్కు సమాచారం అందించారు. దీంతో హెల్ప్‌లైన్ సభ్యుడు సౌమ్యజీత పద్మలోచన వీరింటికి చేరుకుని పరిశీలించారు. వంటగదిలో గ్యాస్ సిలెండరు కింద ఒక రంధ్రంలో నాగుపాము పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. రంధ్రం ఉన్న ప్రాంతాన్ని తవ్వగా భూమిలో 14 నాగుపాము పిల్లలను గుర్తించారు. వీటిని పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు.
Tags :