close

తాజా వార్తలు

Published : 21/01/2021 12:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 1 PM

1. ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికలకు సంబంధించి హైకోర్టు గురువారం ఉదయం కీలక తీర్పు వెలువరించింది. ఎస్‌ఈసీ అప్పీల్‌పై ధర్మాసనం ఎదుట రెండ్రోజుల క్రితం వాదనలు ముగియగా.. జడ్జిమెంట్‌ రిజర్వ్‌ చేసిన హైకోర్టు ఇవాళ తీర్పు ప్రకటించింది. ఇబ్బంది లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. పంచాయతీ ఎన్నికలు, ప్రజారోగ్యం రెండూ ముఖ్యమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎస్‌ఈసీ వేసిన రిట్‌ అప్పీల్‌ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రేషన్‌ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇంటింటికీ నిత్యావసరాల పంపిణీకి ఉద్దేశించిన రేషన్‌ మొబైల్‌ వాహనాలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2,500 వాహనాలకు విజయవాడలోని బెంజి సర్కిల్‌లో సీఎం జెండా ఊపారు. వీటితోపాటు మళ్లీ, మళ్లీ ఉపయోగించుకునేందుకు వీలున్న సంచులను కార్డుదారులకు ఉచితంగా అందజేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,260 వాహనాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్‌, ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జడ్జిలు మారినా న్యాయం మారదు: చంద్రబాబు

న్యాయమూర్తులు మారినంత మాత్రాన న్యాయం మారదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు తీర్పుపై చంద్రబాబు స్పందించారు. ఎన్నికల సంఘం కూడా అనవసరం అనే రీతిలో జగన్‌ వ్యవహరించారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు కూడా వద్దంటారేమోనని విమర్శించారు. ఏ రాజ్యాంగ వ్యవస్థపైనా గౌరవం లేని వ్యక్తి జగన్‌ అని మండిపడ్డారు. ప్రతి ఉన్మాది చర్యకు ప్రత్యామ్నాయ చర్యలు త్వరలోనే ఉంటాయని హెచ్చరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* కళా వెంకటరావు చేసిన తప్పేంటి?:చంద్రబాబు

4. టీకా వేయించుకోనున్న ప్రధాని మోదీ!

రెండో దశ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా వేయించుకోనున్నారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రులు కూడా టీకాను తీసుకోనున్నట్లు  ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలకు అనుమతులు లభించడంతో..జనవరి 16 నుంచే దేశంలో మొదటి దశ టీకా కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. 50ఏళ్లు పైడిన ప్రజాప్రతినిధులకు రెండో దశలో టీకా ఇవ్వనున్నట్లు ప్రధాని స్వయంగా సీఎంల భేటీలో ప్రస్తావించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రారంభమైన టీకా కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు కరోనా టీకాలు పంపిణీ చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రికవరీ రేటు..96.70శాతం

5. వ్యాపార ఆశావహుల కోసం ఐఐటీ సదస్సు

దేశవ్యాప్తంగా యువత, విద్యార్థులు వ్యాపారావకాశాలను అందిపుచ్చుకొనేలా ప్రేరణ కల్పించేందుకు ఐఐటీ హైదరాబాద్‌ ఈ-సెల్‌ ‘ఈ సమ్మిట్‌ 2021-ఏ ప్రాగ్మాటిక్‌ అడ్వెంట్‌’ను నిర్వహిస్తోంది. ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ సదస్సు ఈ ఏడాది జనవరి 22 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు ఆన్‌లైన్‌ వేదికగా జరుగుతోంది. చిన్న వయసులోనే అంకుర సంస్థలను స్థాపించేలా యువతకు ప్రేరణ కల్పిస్తారు. ఇందులో భాగంగా నిపుణులతో ఉపన్యాసాలు, బృంద చర్చలు, పోటీలు, నెట్‌వర్క్‌ ఈవెంట్లను ఏర్పాటు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సెన్సెక్స్‌ సంచలనం @50,000

6. శంషాబాద్‌లో సిరాజ్‌కు ఘన స్వాగతం..

ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసిన టీమ్‌ఇండియా పేసర్‌‌ మహ్మద్‌ సిరాజ్‌ గురువారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా అతడికి ఘన స్వాగతం లభించింది. సిడ్నీ టెస్టులో అతడు జాత్యహంకార వ్యాఖ్యలు ఎదుర్కొని ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. సిరీస్‌లో‌ నిర్ణయాత్మకమైన గబ్బా టెస్టులో ఆస్ట్రేలియా వెన్ను విరిచాడు. అలాగే, ఇతర ఆటగాళ్లు కూడా భారత్‌కు చేరుకున్నారు. తాత్కాలిక కెప్టెన్‌ అజింక్య రహానె, రోహిత్‌ శర్మ, శార్దూల్‌ ఠాకుర్‌, పృథ్వీషా, కోచ్‌ రవిశాస్త్రి ముంబయికి చేరుకోగా.. నటరాజన్‌ బెంగళూరు విమానాశ్రయంలో దిగి తమిళనాడులోని స్వగ్రామానికి పయనమయ్యాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బైడెన్‌.. హారిస్‌ తొలి ట్వీట్లు ఇవే..

అగ్రరాజ్యం అమెరికాలో కొత్త ఉషోదయం ప్రారంభమైంది. డెమొక్రాటిక్‌ నేతలు జో బైడెన్‌, కమలా హారిస్‌ నేతృత్వంలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. అక్కడి కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం ఈ వేడుక జరిగింది. కాగా.. అధ్యక్షుడి హోదాలో బైడెన్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘సమయాన్ని వృథాకానివ్వను ’’ అంటూ తొలి ట్వీట్‌ చేశారు. అటు ప్రమాణస్వీకారం అనంతరం కమలాహారిస్‌ కూడా ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘‘సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అన్నారు. బుధవారం ఉదయమే అమెరికా అధ్యక్షుడి అధికారిక ఖాతా @POTUSను ట్విటర్‌ సంస్థ బైడెన్‌ యంత్రాంగానికి అప్పగించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. డ్రగ్స్‌ కేసులో నటి రాగిణికి బెయిల్‌ మంజూరు

కన్నడ చిత్ర పరిశ్రమలో గతేడాది కలకలం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన నటి రాగిణి ద్వివేదికి గురువారం సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠాతో సంబంధాలున్నాయని, చిత్రపరిశ్రమలో ఎంతోమందికి మాదకద్రవ్యాలను సరాఫరా చేస్తున్నారనే ఆరోపణలతో గతేడాది సెప్టెంబర్‌ లో నటీమణులు రాగిణి, సంజనాను బెంగళూరు క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఇంకా నయం.. వారినీ తీసేస్తారనుకున్నా: గంభీర్‌ 

మరో రెండు నెలల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఏయే ఆటగాడు ఉండాలో ఏయే ఆటగాడు అవసరం లేదో ఇప్పటికే ఆయా ఫ్రాంఛైజీలు ఒక నిర్ణయానికి వచ్చేశాయి. దాంతో బుధవారం తాము వదులుకోవాలనుకున్న ఆటగాళ్ల జాబితాలను విడుదల చేశాయి. అన్ని జట్లూ సగటున ఆరేడు మందిని వదిలించుకోగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మాత్రం సరాసరి 10 మందిని వదిలేసింది. ఈ నేపథ్యంలోనే టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆర్సీబీ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశాడు. ‘క్రికెట్‌ కనెక్టెడ్’‌ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆ జట్టుపై ఒక కొంటె విమర్శ కూడా చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. భారత్‌లో రష్యా టీకా మూడో దశ ప్రయోగాలు మొదలు..

రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌ వి’ మూడోదశ క్లినికల్‌ ప్రయోగాలు ఆగ్రాలో ప్రారంభమయ్యాయి. ఇవి నగరంలోని ఎస్‌.ఎన్‌. మెడికల్‌ కాలేజ్‌లో పదిరోజుల పాటు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఈ క్లినికల్‌ ప్రయోగాలు నిర్వహించేందుకు ఆరోగ్యవంతులైన సుమారు వంద మందిని వాలెంటీర్లుగా ఎంపిక చేస్తామని ఆస్పత్రి అధికారులు వెల్లడించారు. ఇప్పటికే దీనికోసం 46 మంది పేర్లు నమోదు చేసుకున్నారని.. తొలిరోజు ప్రయోగాల్లో భాగంగా వారిలో ఎనిమంది మందికి టీకా ఇచ్చినట్టు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని