close

తాజా వార్తలు

Published : 03/01/2021 08:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 AM

1. కొవాగ్జిన్‌కూ అనుమతి!

కొవిడ్‌-19 నిర్మూలనకు రూపొందిన భారత తొలి స్వదేశీ టీకా కొవాగ్జిన్‌కు నిపుణుల కమిటీ పచ్చజెండా ఊపింది. హైదరాబాద్‌కు చెందిన ఔషధ దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌కు షరతులతో కూడిన అత్యవసర వినియోగ అనుమతిని ఇవ్వాలని ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)కు సిఫార్సు చేసింది. కరోనా వైరస్‌ రూపాంతరం చెంది, కొత్త రకాలు విజృంభిస్తున్న తరుణంలో ఈ చర్యను చేపట్టినట్లు తెలిపింది. క్లినికల్‌ ట్రయల్‌ విధానంలో అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాలని సూచించింది. కొవాగ్జిన్‌కు డీసీజీఐ తుది అనుమతి రావడమే మిగిలి ఉంది. అది లాంఛనప్రాయమేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తలసరి అప్పు.. రూ.70వేలు!

ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్న ప్రతి ఒక్కరిపై ఇప్పటివరకు దాదాపు రూ.70వేల అప్పు ఉన్నట్లు లెక్కలు తేలుస్తున్నాయి. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు చేసిన తలసరి అప్పు దాదాపు రూ.13వేల పైమాటే. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌ నిర్వహణలో భాగంగా నవంబరు నెలాఖరు వరకు రూ.73,811.85 కోట్లు వివిధ రూపాల్లో రుణంగా ప్రభుత్వం సమకూర్చుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు నెలలు మిగిలి ఉంది. ఇంకా నాలుగు నెలల లెక్కలు తేలాల్సి ఉంది. ఆలోపు రుణాల మొత్తం మరింత పెరుగుతుంది. ఆ రూపేణా ఈ ఏడాది తలసరి అప్పు మరింత పెరుగుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కృత్రిమ మేధతో అద్భుత ఫలితాలు

కృత్రిమ మేధ పరిజ్ఞానంతో తెలంగాణ అద్భుత ఫలితాలు సాధించిందని, సాంకేతికత సాయంతో కరోనా సమయంలో పలు సవాళ్లను అధిగమించిందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. 2020ని ఏఐ నామసంవత్సరంగా ప్రకటించి కార్యాచరణ చేపట్టడం ద్వారా కృత్రిమ మేధ(ఏఐ)లో రాష్ట్రం ప్రపంచస్థాయి కేంద్రంగా మారిందని చెప్పారు. ఈ స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని చెప్పారు. ప్రగతిభవన్‌లో శనివారం ‘‘తెలంగాణలో ఐఏ నామ సంవత్సరం 2020.. ఆ తర్వాత’’ శీర్షికన రూపొందించిన వార్షిక నివేదికను మంత్రి విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నాలుగు రోజుల్లోనే పాస్‌పోర్టు

సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో విలువైన సేవలందిస్తున్న నగర పోలీసులు.. పాస్‌పోర్ట్‌ విచారణ ప్రక్రియను నాలుగు రోజుల్లోనే పూర్తి చేస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌ నుంచి కరోనా ప్రభావం కొనసాగుతున్నా.. 1,00,346 పాస్‌పోర్టు అభ్యర్థనలను విచారించారు. విచారణను దరఖాస్తుదారులు తెలుసుకునేందుకు ముఖాముఖి స్పందన వ్యవస్థ(ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌)ను అందుబాటులోకి తీసుకొచ్చారు. గతంలో పాస్‌పోర్టుల జారీకి 21 నుంచి 40 రోజులు పట్టేంది. ప్రస్తుతం ‘వెరీ ఫాస్ట్‌’ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. విజయవంతంగా కరోనా కొత్త వైరస్‌ వృద్ధి

బ్రిటన్‌లో వెలుగుచూసిన కరోనా కొత్త రకం వైరస్‌ను భారత్‌లోని ప్రయోగశాలలో విజయవంతంగా వృద్ధిచేసినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) శనివారం తెలిపింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఏ దేశమూ సార్స్‌కోవ్‌-2 బ్రిటన్‌ రకాన్ని(వేరియంట్‌) వేరుచేయలేదని, వృద్ధి చేయలేదని ఐసీఎంఆర్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. ‘‘బ్రిటన్‌ నుంచి భారత్‌కు తిరిగివచ్చిన వ్యక్తుల నుంచి సేకరించిన నమూనాల ఆధారంగా జాతీయ వైరాలజీ సంస్థ (ఎన్‌ఐవీ)లో కొత్త వైరస్‌ను విజయవంతంగా వేరుచేశాం. వృద్ధి చేశాం’’ అని వివరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వేలిముద్ర వేస్తేనే ‘సాధారణ’ సీటు

విశాఖ రైల్వేస్టేషన్‌లో సాధారణ ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి వాల్తేర్‌ ఆర్పీఎఫ్‌ అధికారులు వినూత్న ఆలోచన చేశారు. విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లకు బయోమెట్రిక్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. టికెట్‌ తీసుకున్న తర్వాత బయోమెట్రిక్‌ యంత్రం వద్దకు వెళ్లి వేలిముద్ర వేస్తే.. ఒక నంబరుతో టోకెన్‌ వస్తుంది. దీని ఆధారంగా రైలులోని సాధారణ బోగీలో సీటు పొందొచ్చు. ఇలా ప్రస్తుతం సాధారణ బోగీలో ఉండే 90 సీట్లకు మాత్రమే టోకెన్లు ఇస్తారు. తర్వాత రైళ్లను పూర్తిస్థాయిలో తిప్పినప్పుడు 90 దాటిన తర్వాత కూడా టోకెన్లు ఇస్తారు గానీ, వాళ్లు సాధారణ బోగీలో నిలబడే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఏప్రిల్‌ నాటికి స్ఫుత్నిక్‌ వి టీకా?

సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌కు చెందిన కొవిడ్‌-19 టీకాలైన కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌కు డీసీజీఐ (భారత్‌ ఔషధ నియంత్రణ మండలి)లోని సబ్జెక్టు నిపుణుల కమిటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వటంతో ఈ రెండు టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ టీకాలకు ఇక డీసీజీఐ తుది అనుమతి ఇవ్వటమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఇతర కంపెనీల టీకాలు ఏ దశలో ఉన్నాయి, ఎప్పటికి రావచ్చు...అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా మారింది. రష్యాకు చెందిన స్ఫుత్నిక్‌ వి టీకా నాలుగైదు నెలల్లో దేశీయ మార్కెట్లోకి వస్తుందని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ముంబయి పేలుళ్ల సూత్రధారి లఖ్వీ అరెస్టు

ముంబయి పేలుళ్ల సూత్రధారి, లష్కర్‌-ఎ-తొయిబా కమాండర్‌ జకీ-ఉర్‌-రెహ్మాన్‌ లఖ్వీ (61)ని శనివారం పాకిస్థాన్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడన్న ఆరోపణలతో నమోదయిన కేసులో లఖ్వీని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల స్వేచ్ఛకు సంకెళ్లు వేయాలని పాకిస్థాన్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. తాము నిర్వహించిన నిఘా ఆపరేషన్‌ అనంతరం లఖ్వీని లాహోర్‌లో అరెస్టు చేసినట్లు పంజాబ్‌ ప్రావిన్సుకి చెందిన ఉగ్రవాద వ్యతిరేక విభాగం(సీటీడీ) వర్గాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వంద శాతం ఫిట్‌గా లేకపోయినా..

రెండో టెస్టులో భారత్‌ చేతిలో అనూహ్య ఓటమి ఎదుర్కొన్న ఆతిథ్య ఆస్ట్రేలియా సిడ్నీలో ఈనెల 7న ఆరంభమయ్యే మూడో టెస్టు కోసం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ను ఇప్పటికే జట్టులో చేర్చిన ఆసీస్‌.. అతను వందశాతం ఫిట్‌గా లేకపోయినా మూడో టెస్టులో ఆడించేందుకు సన్నద్ధమవుతోందని సమాచారం! ఓపెనర్లకు తోడు స్టీవెన్‌ స్మిత్‌ కూడా విఫలమవడంతో సిరీస్‌లో ఇప్పటిదాకా కంగారూ జట్టు ఒక్కసారి మాత్రమే 200 పరుగుల స్కోరు సాధించగలిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అదే గొప్ప గురువు

గతేడాది నాని ‘వీ’లో సాహెబాగా నటించి మెప్పించిన నటి అదితి రావు హైదరీ. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ ఇలా అన్ని భాషల్లోనూ నటిస్తూ దూసుకుపోతుందీ భామ. ‘‘ఓటమిని గుణపాఠం చెప్పే గురువుగా   భావిస్తాన’’ని చెబుతోంది. ‘‘ఒక్క అపజయం మనలోని నిజమైన వ్యక్తిత్వాన్ని వెలికి  తీస్తుంది. మనమేంటో మనకు పరిచయం చేస్తుంది. జీవనపోరాటంలో చేసే పరుగులో ఒక్కోసారి కిందపడిపోతాం. కాళ్లు మట్టికొట్టుకుపోతాయి. చిన్నపాటి గాయాలూ అవుతాయి. అయినా బలంగా నిలబడాలి. కాళ్లకు అంటిన దుమ్ము దులిపి మళ్లీ పరుగు ప్రారంభించాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని