close

తాజా వార్తలు

Published : 20/03/2020 09:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఊగిసలాటలో మొదలైన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఊగిలాట ధోరణిలో ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్‌ భయాలు కొనసాగడం, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో నిన్న సూచీలు భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. ట్రేడింగ్‌ ఆరంభం లాభాలతోనే మొదలైన మార్కెట్లు మళ్లీ క్షీణించాయి. ఉదయం 9.39 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 254 పాయింట్ల నష్టంతో 28,099 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 50 పాయింట్ల నష్టంతో 8,212 వద్ద ట్రేడవుతోంది. యూఎస్‌ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74.79 వద్ద కొనసాగుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ కరోనాపై పోరాటానికి ఆర్థిక మంత్రి సీతారామన్‌ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం సానుకూల ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఐటీసీ లిమిటెడ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్‌ఫోసిస్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. భారతీ ఇన్‌ఫ్రాటెల్, కోల్‌ ఇండియా, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఓఎన్జీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని