సెహ్వాగ్ లెఫ్ట్‌హ్యాండ్‌తో ఆడినట్లు ఉంది 
close

తాజా వార్తలు

Published : 09/03/2021 02:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సెహ్వాగ్ లెఫ్ట్‌హ్యాండ్‌తో ఆడినట్లు ఉంది 

రిషభ్‌ పంత్‌ బ్యాటింగ్‌పై ఇంజమామ్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ రిషభ్‌పంత్‌ బ్యాటింగ్‌ చూస్తుంటే మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఎడమ చేతితో ఆడుతున్నట్లు అనిపించిందని పాక్‌ మాజీ సారథి ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ ప్రశంసించాడు. పంత్‌ బ్యాటింగ్‌ అద్భుతంగా ఉందని, చాలాకాలం తర్వాత ఒత్తిడి లేకుండా ఆడుతున్న బ్యాట్స్‌మన్‌ను చూశానని చెప్పాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో పంత్‌(101) శతకం చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్‌ మాజీ సారథి పంత్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. తన యూట్యూబ్‌ ఛానెల్లో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘రిషభ్‌పంత్‌ అద్భుతంగా ఆడాడు. చాలాకాలం తర్వాత ఒత్తిడే ఎరుగని బ్యాట్స్‌మన్‌ను చూశాను. 146 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన స్థితిలోనూ అతడిలా ఎవరూ ఆడలేరు. పిచ్‌ ఎలా ఉన్నా.. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా తన సహజసిద్ధమైన ఆటను ఆడగలడు. ఫాస్ట్‌ బౌలర్లు, స్పిన్నర్లు అనే తేడా లేకుండా చూస్తాడు. అతడి ఆటను పూర్తిగా ఆస్వాదించాను. ఆ బ్యాటింగ్‌ చూస్తుంటే సెహ్వాగ్‌ ఎడమ చేతితో ఆడుతున్నట్లు అనిపించింది. నేను సెహ్వాగ్‌తో ఆడాను. అతడు కూడా పరిస్థితుల గురించి ఆలోచించకుండా ఆడతాడు. వీరూ బ్యాటింగ్‌ చేస్తుంటే పిచ్‌ ఎలా ఉంది. ప్రత్యర్థులు ఎవరనేవి లెక్కలోకి రావు. బంతిని దంచికొట్టడమే పనిగా పెట్టుకుంటాడు. బౌండరీ వద్ద ఫీల్డర్లు ఉన్నా అలాగే ఆడతాడు. సెహ్వాగ్‌ తర్వాత అతడిలాంటి బ్యాట్స్‌మన్‌ను పంత్‌నే చూశాను. అతడు భారత్‌లోనే కాకుండా ఆస్ట్రేలియాలోనూ రాణించాడు.  అతడికున్న ఆత్మవిశ్వాసం నమ్మశక్యం కానిది. నా క్రికెట్‌ జీవితంలో ఇలాంటి ఆటగాడిని చూడలేదు’ అని పాక్ మాజీ సారథి కొనియాడాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని