₹ 1 కే వంట సరుకులు.. మోసపోకండి!
close

తాజా వార్తలు

Published : 23/06/2021 21:30 IST

₹ 1 కే వంట సరుకులు.. మోసపోకండి!

హైదరాబాద్‌: ‘ఒక్క రూపాయికే నిత్యావసర వస్తువులు ఇస్తాం. మీరు ఎక్కడికి రానక్కర్లేదు.. మేమే మీ ఇంటికి ఉచితంగా డెలివరీ చేస్తాం’ ఇలాంటి ప్రకటనలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్నాయా? మీరు కనుక వాటిని నమ్మినట్లయితే మీ జేబుకు చిల్లు పడినట్టే! ఇది ‘జాప్ నౌ’ అనే ఈ కామర్స్ సంస్థ చేస్తున్న మాయాజాలం. పొరపాటున ఆర్డర్ పెట్టి సొమ్ము చెల్లించారంటే మీకు వస్తువులు రాకపోగా డబ్బులు కూడా వెనక్కి రావు.

సైబర్‌ నేరస్థులు రోజుకో పంథాలో నేరాలకు పాల్పడుతున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని అందినంత మేర దోచుకుంటున్నారు. కొత్తగా జాప్‌ నౌ అనే ఈ కామర్స్ వెబ్‌సైట్‌ ద్వారా నిత్యావసర సరకులు ₹ 1 కే అందిస్తామని ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. గూగుల్‌ యాడ్స్‌లో వివిధ రకాల వస్తువులు ₹ 1 కే ఇస్తామంటూ వల విసురుతున్నారు. కార్ట్‌లో వస్తువులను యాడ్‌ చేసుకున్న తర్వాత కనీసం 1500 రూపాయల సరకులు కొనుగోలు చేయాలని షరతు విధిస్తున్నారు. క్యాష్‌ అన్‌ డెలివరీ లేకుండా ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలనే నిబంధన పెట్టి సొమ్ము కాజేస్తున్నారు.ఈ మోసాలపై వరుస ఫిర్యాదులు అందడంతో సైబర్‌ క్రైం పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సైబర్‌ నేరస్థుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎటువంటి అనుమానం ఉన్నా తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని