న్యాయమూర్తి ఉత్తమ్‌ ఆనంద్‌ హత్య కేసుపై స్పందించిన ధర్మాసనం 

తాజా వార్తలు

Published : 30/07/2021 17:08 IST

న్యాయమూర్తి ఉత్తమ్‌ ఆనంద్‌ హత్య కేసుపై స్పందించిన ధర్మాసనం 

దిల్లీ: ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో బుధవారం జరిగిన జిల్లా కోర్టు న్యాయమూర్తి ఉత్తమ్ ఆనంద్  హత్య కేసులో దర్యాప్తుపై వారం రోజుల్లో చర్యా నివేదిక అందజేయాలని సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశించింది. ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఝార్ఖండ్‌ హైకోర్టు ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తుందని తెలిపింది. దేశ వ్యాప్తంగా న్యాయ అధికారులు, సిబ్బందిపై జరుగుతున్న ఘటనలను సుమోటోగా విచారణకు స్వీకరిస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ కేసుపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. దీనిపై వచ్చే వారం జరగనున్న విచారణకు ఝార్ఖండ్‌ అడ్వకేట్‌ జనరల్‌ హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది. 

జస్టిస్‌ ఉత్తమ్‌ ఆనంద్‌ బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో జాగింగ్‌ చేస్తుండగా.. ఓ ఆటో వచ్చి ఆయనను ఢీకొట్టి వేగంగా వెళ్లింది. తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆయనను అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి గమనించి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా జస్టిస్‌ ఉత్తమ్‌ ఆనంద్‌ మరణించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. దాంతో హిట్‌ అండ్‌ రన్‌గా పోలీసుల కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై బార్‌ అసోసియేషన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టింది. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని