Katrina Kaif: 15 ఏళ్లుగా అదే ప్రశ్న అడుగుతున్నారు: కత్రిన

తాజా వార్తలు

Published : 28/10/2021 01:28 IST

Katrina Kaif: 15 ఏళ్లుగా అదే ప్రశ్న అడుగుతున్నారు: కత్రిన

ముంబయి: బాలీవుడ్‌ నటులు కత్రినాకైఫ్‌- విక్కీ కౌశల్‌ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని, వచ్చే నవంబర్‌-డిసెంబర్‌ నెలలో రాజస్థాన్‌లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటవుతున్నారనే వార్తలు ఇటీవల నెట్టింట చక్కర్లు కొట్టాయి. గతంలోనూ వీరి వివాహం గురించి ప్రచారం జరిగింది. ఇన్నాళ్లు ఈ విషయంపై మౌనం వహించిన కత్రినా కైఫ్‌... తొలిసారి దీనిపై స్పందించింది. ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విక్కీకౌశల్‌తో వివాహం అంటూ వస్తున్న వార్తలను ఖండించింది.

‘‘15 ఏళ్లుగా మీకు పెళ్లంట కదా’ అని ప్రశ్నిస్తూనే ఉన్నారు. విక్కీతో నా పెళ్లి అనేది పూర్తిగా అవాస్తవం. మా ఇద్దరికీ అలాంటి ప్లాన్స్‌ లేవు. అయినా సోషల్‌ మీడియాలో నెలకో స్టోరీ రాస్తూనే ఉంటారు. నిజం చెప్పాలంటే ఈ రూమర్స్‌ని పట్టించుకునేంత తీరికే నాకు లేదు. షూటింగ్స్‌తోనే నా జీవితం బిజీగా గడిచిపోతుంది. నా దృష్టి అంతా నా పనిమీదే’’ అంటూ వదంతులను కొట్టిపారేశారు. ఇక సినిమాల విషయానికొస్తే అక్షయ్‌ కుమార్‌ సరసన ‘సూర్యవంశీ’లో కత్రినా కనిపించనుంది. ఈ చిత్రం నవంబర్‌ 5న థియేటర్లలో సందడి చేయనుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని