ప్రేమికుల ఉసురు తీసిన పెళ్లి ప్రస్తావన
close

తాజా వార్తలు

Updated : 26/01/2021 14:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రేమికుల ఉసురు తీసిన పెళ్లి ప్రస్తావన

నందిపేట్ : నాలుగేళ్లుగా ఆ యువతి, యువకులు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నారు. ఇంతలో తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో తనను త్వరగా వివాహం చేసుకోవాలంటూ ఆ యువతి ప్రేమికుడిని కోరింది. తాను జీవితంలో స్థిరపడిన తరువాతే ఇద్దరం వివాహం చేసుకుందామన్న యువకుడి ప్రతిపాదనతో తీవ్ర మనస్తాపంతో ప్రేమికురాలు బలవన్మరణానికి పాల్పడింది. ప్రేయసి మరణానికి కారణమయ్యాననే మనో వేదనతో ఆ ప్రేమికుడూ ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు కుటుంబాల్లో తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన ఈ విషాద ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. 
నందిపేట్‌ మండలం ఖుదావంద్‌పూర్‌కు చెందిన డీకంపల్లి సుకన్య(21), అయిలాపూర్‌కు చెందిన ప్రేమ్‌ కుమార్‌(22) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పక్కపక్క గ్రామాలకు చెందిన వీరిద్దరు నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్‌ కళాశాలలో ఇటీవలే డిగ్రీ పూర్తిచేసుకున్నారు. యువతికి పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో ఆదివారం రాత్రి ప్రేయసిప్రియులిద్దరూ చరవాణిలో చాటింగ్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా తనను పెళ్లి చేసుకోవాలని ప్రేమ్‌కుమార్‌ను సుకన్య కోరింది. తానింకా స్థిరపడలేదని..కొన్నాళ్లు ఆగుదామని యువకుడు పేర్కొనడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. మనస్తాపానికి గురైన సుకన్య సోమవారం ఉదయం తన గదిలో ఉరేసుకుంది. శబ్దం రావడంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందింది. అయిలాపూర్‌లో ఉన్న ప్రియుడు ప్రేమ్‌కుమార్‌కు విషయం తెలియడంతో తీవ్ర వేదనకు గురై గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రెండు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శోభన్‌బాబు తెలిపారు.

 

ఇవీ చదవండి...
ఓ ప్రజాప్రతినిధి మా స్థలం కబ్జా చేశారయ్యా!

మూఢత్వమే ప్రాణాలు తీసింది!
 Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని