‘అసైన్డ్‌ భూమి ఉన్నట్లు విచారణలో తేలింది’
close

తాజా వార్తలు

Updated : 01/05/2021 12:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అసైన్డ్‌ భూమి ఉన్నట్లు విచారణలో తేలింది’

మెదక్‌ జిల్లా కలెక్టర్‌

మెదక్‌: తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటలపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలకు సంబంధించి మెదక్‌ జిల్లా అచ్చంపేటలో అ.ని.శా, విజిలెన్స్‌ అధికారులు ఈ ఉదయం విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ విజిలెన్స్ విచారణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మూసాపేట తహసీల్దార్‌ కార్యాలయంలో భూముల రికార్డులనుపరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ‘‘అసైన్డ్‌ భూమి ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. క్షేత్రస్థాయిలో సర్వే పూర్తయిన తర్వాత నివేదిక సమర్పిస్తాం’’ అని అన్నారు. 

అచ్చంపేటలో తుప్రాన్‌ ఆర్డీవో రాంప్రకాశ్‌ ఆధ్వర్యంలో భూములను సర్వే చేస్తున్నారు. ఆరు ప్రత్యేక బృందాలు ఈ సర్వే చేస్తున్నాయి. ఈటలకు చెందిన హేచరీస్‌లో డిజిటల్‌ సర్వే కొనసాగుతోంది. దీంతో పాటు హేచరీస్‌కు పక్కన ఉన్న అసైన్డ్‌ భూముల్లోనూ అధికారులు డిజిటల్‌ సర్వే చేస్తున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని