రాహుల్‌ స్థానంలో ఇషాన్‌కు అవకాశం ఇవ్వండి..
close

తాజా వార్తలు

Published : 20/03/2021 15:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాహుల్‌ స్థానంలో ఇషాన్‌కు అవకాశం ఇవ్వండి..

ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైఖేల్‌ వాన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌ తుది అంకానికి చేరింది. నేటి సాయంత్రం జరిగే ఫైనల్లో ఇరు జట్లూ హోరాహోరీ తలపడే అవకాశం ఉంది. ప్రస్తుతం చెరో రెండు విజయాలతో సమానంగా నిలవడంతో అందరి ఆసక్తీ ఇప్పుడు ఫైనల్‌పై పడింది. ఇక ఇప్పటికే టెస్టు సిరీస్‌ కోల్పోయిన ఇంగ్లాండ్‌ ఈ మ్యాచ్‌లో గెలిచి పొట్టి కప్పును సాధించాలని చూస్తుండగా, మరోవైపు టీమ్‌ఇండియా నాలుగో టీ20లో అద్భుత విజయం సాధించడంతో పోటీలో బలంగా కనిపిస్తోంది. కాగా, తుదిపోరుకు ముందు కోహ్లీసేనకు జట్టు ఎంపికలో ఇబ్బందులు తప్పేలా లేవు.

ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ ఈ సిరీస్‌లో పూర్తిగా విఫలమైన నేపథ్యంలో అతడికి బదులు ఫామ్‌లో ఉన్న ఇషాన్‌ కిషన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైఖేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఇదే విషయంపై ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడాడు. ‘ఈ మ్యాచ్‌లో రాహుల్‌ ఆడడు. ఇంతకుమించి వేరే దారిలేదు. అతడి స్థానంలో బాగా ఆడుతున్న ఇషాన్‌ను తుదిజట్టులోకి తీసుకోవాలి. ఎలా ఆడాలనే స్పష్టత, ఆత్మవిశ్వాసం ఉన్న యువ బ్యాట్స్‌మన్‌ ఓపెనింగ్‌ చేస్తాడు. అయితే, రాహుల్‌ను పూర్తిగా జట్టు నుంచి తప్పిస్తారని నేను అనుకోను. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతడు ఆత్మవిశ్వాసంతో లేడు. ఫామ్‌ కోసం సతమతమౌతున్నాడు. అందువల్లే రోహిత్‌తో కలిసి ఇషాన్‌ ఓపెనింగ్‌ చేస్తాడు’ అని వాన్‌ చెప్పుకొచ్చాడు. కాగా, రెండో టీ20లో వచ్చిన తొలి అవకాశాన్నే ఇషాన్‌(56; 32 బంతుల్లో 5x4, 3x6) చక్కగా వినియోగించుకున్నాడు. అర్ధశతకంతో చెలరేగి జట్టు విజయంలో తనదైన ముద్ర వేశాడు. దీంతో ఈ యువబ్యాట్స్‌‌మన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని