రాహుల్ త్వరగా కోలుకోవాలి: మోదీ
close

తాజా వార్తలు

Published : 20/04/2021 17:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాహుల్ త్వరగా కోలుకోవాలి: మోదీ

దిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి కరోనా సోకడంపై ప్రధాని మోదీ స్పందించారు. రాహుల్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘ లోక్‌సభ ఎంపీ రాహుల్‌ గాంధీ త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ట్విటర్‌లో పోస్టు చేశారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కొవిడ్‌ పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్‌ తేలినట్లు రాహుల్‌ గాంధీ స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్నవారంతా కరోనా పరీక్ష చేయించుకోవాలని ఆయన ట్విటర్‌లో సూచించారు. ఇటీవల దేశంలో పలువురు కీలకనేతలకు కొవిడ్‌ సోకుతున్న విషయం తెలిసిందే. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మరో కీలక నేత ఆనంద్‌శర్మ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప తదితరులకు కొవిడ్‌ సోకింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని