Aamirkhan: లగాన్‌కి ఆస్కార్‌ రాలేదన్న నిరాశ ఉంది
close

తాజా వార్తలు

Updated : 16/06/2021 05:58 IST

Aamirkhan: లగాన్‌కి ఆస్కార్‌ రాలేదన్న నిరాశ ఉంది

  ఈ చిత్రం విడుదలై 20ఏళ్లు 

ఇంటర్నెట్‌ డెస్క్‌: 20ఏళ్ల క్రితం... జూన్‌ 15, 2001న బాలీవుడ్‌లో విడుదలైంది ‘లగాన్‌’. స్వాతంత్ర్య సమర వేళ.. ఓ చిన్నగ్రామంలో బ్రిటిష్‌ అధికారులపై క్రికెట్‌ పోటీలో నెగ్గి.. పన్నులు కట్టకుండా ఎలా విజయం అందుకున్నారనే అంశంతో రూపొందిన ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. అటు ప్రేక్షకుల అభిమానంతో పాటు విమర్శకుల ప్రశంసలూ పొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర సత్తా చాటింది. అంతేకాదు.. 2002 ఏడాదికి గానూ ఉత్తమ విదేశీ చిత్రంగానూ ఆస్కార్‌కు ఎంపిక అయినా.. నిరాశే ఎదురైంది. కాగా ఈ చిత్రం విడుదలై 20ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ప్రేమాభిమానాలను గుర్తుచేసుకున్న నటుడు ఆమిర్‌ఖాన్‌. ఆస్కార్‌ వరించలేదనే అంశంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘‘చాలా మంది నన్ను తరచూ అడిగే ప్రశ్న ఇది.. లగాన్‌కి ఆస్కార్‌ వరించలేదని నిరాశ చెందారా?అని! దానికి నేనిచ్చే సమాధానం.. అవును. ఇది కచ్చితంగా ఆస్కార్‌ పొందాల్సిన చిత్రమే. అదేవిధంగా పాటలు, చిత్ర నిడివి కారణంగానే అకాడమీ సభ్యులు వెనక్కిపెట్టారా ? అని అడుగుతుంటారు చాలా మంది..  ‘‘ వాస్తవానికి ఈ చిత్రం నామిటేట్‌ అవ్వడమే కాకుండా టాప్‌ ఐదు జాబితాలో ఉంది. అంతే కాదు.. కమిటీ సభ్యులకీ ఈ చిత్రం నచ్చింది.’’ లగాన్‌ చిత్రం గురించి తెలియని వారు సైతం..ఈ చిత్రం గొప్పదనం తెలుసుకొని మరీ ఈ సినిమాని వీక్షించారు.

అదే పెద్దసవాల్‌..

‘లగాన్‌’పై ప్రేమను గుర్తు చేసుకుంటూ.. ‘‘ ఈ సినిమా చేస్తున్నప్పుడు పెద్ద సవాలు స్వీకరించానని అనిపించింది. ఎందుకంటే ఇది అసాధారణమైన చిత్రం కాదు. షూటింగ్‌కి సిద్ధమయ్యే ముందు సైతం.. నా మిత్రులు, నిర్మాతలు ఆదిత్యా చోప్రా, కరణ్‌జోహార్‌ సలహాలిచ్చారు. ‘‘నీ ప్రొడక్షన్‌లో వస్తున్న తొలి భారీ చిత్రం ఇదే కాబట్టి  30రోజులు షూటింగ్‌ పూర్తయ్యాక సినిమా సాధ్యాసాధ్యాలను పరిశీలించుకో. సింగిల్‌ షెడ్యూల్‌ మాత్రం చేయకు.. ఎందుకంటే.. ఒక వేళ తప్పులు ఉంటే సరిదిద్దుకునేందుకు అవకాశం ఉండదు, పైగా షూటింగ్‌ ఆలస్యమవుతుంది’’ అని సలహా ఇచ్చారు అని చెప్పారు. ఆమిర్‌ఖాన్‌, గ్రేసీసింగ్‌ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో కుల్‌భూషణ్‌ కర్బందా, రాజేంద్రగుప్తా, రాజేష్‌ వివేక్‌, ప్రదీప్‌ రావత్‌ ప్రధానపాత్రలు పోషించగా. బ్రిటీష్‌ నటులు రాచెల్‌ షెల్లీ, పాల్‌బ్లాక్‌ త్రోన్‌ నటించారు. ఏఆర్‌ రహమాన్‌ బాణీలు అందించారు. అశుతోష్‌ గోవారికర్‌ దర్శకత్వం వహించిన ఈచిత్రం రూ.25 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా.. బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ.66 కోట్ల కలెక్షన్లు సాధించింది.

మరోవైపు.. ఆ చిత్రంలో ‘గౌరి’గా సందడి చేసిన గ్రేసీసింగ్‌ సైతం ‘లగాన్‌’ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ‘నా సినిమా ప్రయాణం ప్రారంభమైంది అక్కడే. కెమెరా ముందు నిల్చొని ప్రతిక్షణం ఆస్వాదించాను. ఆ అద్భుతానికి 20ఏళ్లు. లగాన్‌ బృందానికి, ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు’ అంటూ ఆమె ట్వీట్‌ చేసింది. సినిమా సెట్లో క్లిక్‌మనిపించిన కొన్ని ఫొటోలను ఆమె పంచుకుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని