
తాజా వార్తలు
గుంటూరు జిల్లాలో తెదేపా నేత దారుణహత్య
దాచేపల్లి: గుంటూరు జిల్లాలో తెదేపా నేత దారుణహత్యకు గురయ్యారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచి పురంశెట్టి అంకులు(55)ను గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి హతమార్చారు. దాచేపల్లిలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో అంకులు గొంతుకోసి చంపేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :