close

తాజా వార్తలు

Updated : 17/04/2021 17:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

Top 10 News @ 5 PM

1. తిరుపతి ఉపఎన్నికపై సీఈసీకి చంద్రబాబు లేఖ

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో భాగంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జరిగిన పోలింగ్‌ను రద్దు చేసి, కేంద్ర బలగాలతో తిరిగి నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)కి ఆయన లేఖ రాశారు. తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో జరిగిన అక్రమాలపై తగు చర్యలు తీసుకోకుంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే అవుతుందని లేఖలో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నకిలీ ఓటర్లపై కఠిన చర్యలు: సీఈవో

2. రెండో వేవ్‌ తీవ్రత అధికం: డా.శ్రీనివాస్‌

దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ వ్యాప్తి ఉద్ధృతంగా ఉందని తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌ తెలిపారు. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత మొదటిసారిగా రెండు లక్షల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. కోఠిలోని ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మార్చి 3న తొలి కేసు నమోదు అయినప్పటి నుంచి కేసులు క్రమంగా పెరుగుతున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో మహమ్మారి ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. 25 దాటితే టీకా.. రూ.6వేలు ఆర్థిక సాయం: సోనియా

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. కరోనాపై పోరాడే క్రమంలో కొన్ని రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేశారు. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన విధివిధానాలపై నేడు వర్చువల్‌గా జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో చర్చించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మమతకు గర్వం.. సమావేశాలకు హాజరుకారు!  

పశ్చిమ్‌బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీకి గర్వం ఎక్కువని ప్రధాని నరేంద్ర మోదీ ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశాలకు ఏవో సాకులు చూపించి ఆమె రావడంలేదని విమర్శించారు. బెంగాల్‌లో ఐదో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అసన్‌సోల్‌లో ప్రసంగించారు. ‘మమత అహంకారిగా మారారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే సమావేశాలకు ఏవేవో సాకులు చెప్పి హాజరు కావడంలేదు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే శాంతిభద్రతల్ని పునరుద్ధరిస్తాం’’ అని హామీ ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 నా ఫోన్‌ ట్యాప్‌ చేశారు: మమత

5. తెదేపాది అనవసర రాద్ధాంతం: సజ్జల

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ప్రశాంతంగా జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. వైకాపా అధికారంలోకి వచ్చాక జరిగే తొలి ఉప ఎన్నిక అని.. గతంతో పోలిస్తే ఇంత ప్రశాంతంగా ఎప్పుడూ ఉప ఎన్నికలు జరగలేదన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఇలాగే ఉండాలని తమ ప్రభుత్వం నిరూపిస్తోందని చెప్పారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ తెదేపా నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రోగుల ఎదుట నృత్యం చేస్తోన్న వైద్యులు

 కరోనా బాధితుల్లో నెలకొన్న భయాలను పోగొట్టి, వారిలో మానసిక స్థైర్యం నింపేందుకు గుజరాత్‌లోని ఓ ఆసుపత్రి సిబ్బంది వినూత్న రీతిలో చికిత్సకు శ్రీకారం చుట్టింది. వడోదరలోని పారుల్‌ ఆసుపత్రిలో కొవిడ్‌ బాధితులకు మ్యూజిక్‌ థెరపీని వైద్యులు ప్రారంభించారు. రోగుల ఎదుట సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తూ వారిని ఉత్సాహపరుస్తున్నారు. ఇలా చేయడం ద్వారా కొవిడ్‌ గురించి బాధితుల్లో ఉన్న ఆందోళన తగ్గి వారిలో మానసిక స్థైర్యం పెరుగుతుందని వైద్యులు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

గులాబీ రంగు కళ్లు.. జీర్ణాశయ సమస్యలు..

7. 77,954 హోండా కార్లు వెనక్కి

దేశవ్యాప్తంగా 77,954 కార్లను హోండా కార్స్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌సీఐఎల్‌) వెనక్కి పిలిపించనుంది. లోపాలున్న ఇంధన పంపులను సరిచేయడంలో భాగంగా ఈ రీకాల్‌ చేపట్టింది. 2019 జనవరి నుంచి 2020 సెప్టెంబరు మధ్య తయారైన అమేజ్, 4వ తరం సిటీ, డబ్ల్యూఆర్‌-వి, జాజ్, సివిక్, బీఆర్‌-వి, సీఆర్‌వీ మోడళ్లపై ఈ రీకాల్‌ ప్రభావం పడనుంది. ఈ కార్లలోని ఇంధన పంపుల్లో లోపాలున్న ఇంపెలర్ల వల్ల ఇంజిన్‌ ఆగిపోవడం, ప్రారంభం కాకపోవడం జరగొచ్చని హోండా కార్స్‌ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Sonu soodకి కరోనా పాజిటివ్‌

రియల్‌ హీరో, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శనివారం సోనూ ఓ ట్వీట్‌ పెట్టారు. ‘ఈరోజు ఉదయం నాకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రస్తుతం నేను స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను. తగిన జాగ్రత్తలు పాటిస్తున్నాను. కానీ, మీరు ఏమాత్రం బాధపడకండి.. మీ సమస్యలను తీర్చేందుకు దీనివల్ల నాకు మరింత సమయం దొరికింది’ అని సోనూసూద్‌ ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రైల్వేస్టేషన్లలో మాస్క్‌ లేదంటే రూ.500 ఫైన్‌

9. ‘రాధేశ్యామ్‌’లో పూజా పాత్ర అదేనా?

 ప్రభాస్‌ - పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రొమాంటిక్‌ పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఇందులో పూజాహెగ్డే  ‘ప్రేరణ’ అనే పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఇందులో మెడికోగా కనిపించనుందని వార్తలొస్తున్నాయి. కథలో ప్రభాస్‌ ఓ ప్రమాదంలో చిక్కుకుని ఆసుపత్రిలో చేరతాడట. అక్కడే ప్రేరణ (పూజా) మెడికోగా పని చేస్తుంటుందట. అప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ ప్రయాణం మొదలవుతోందనే వార్త వినిపిస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్స్, గ్లింప్స్ విడుదలై చిత్రంపై అంచనాలను పెంచేశాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. MS Dhoni: సీఎస్‌కే గుండె చప్పుడు

 చెన్నై సూపర్‌కింగ్స్‌ గుండెచప్పుడు కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ అని జట్టు కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ ప్రశంసించాడు. 200 మ్యాచులు ఆడిన తర్వాత కూడా తమ జట్టు బాగా రాణించాలని కోరుకోవడం ఫ్రాంచైజీపై, ఆటపై అతడి వైఖరికి నిదర్శనమని పేర్కొన్నాడు. అతడి సుదీర్ఘ సేవలను కచ్చితంగా గుర్తించాలన్నాడు. ఫ్రాంచైజీతో మహీ.. మహీతో ఫ్రాంచైజీ కలిసి ఎదగడం జరిగిందన్నాడు. ప్రదర్శన, మార్గనిర్దేశం, నాయకత్వంలో అతడికి తిరుగులేదని ప్రశంసించాడు. పంజాబ్‌తో మ్యాచ్‌ ఆడిన తర్వాత ఆయన‌ మాట్లాడాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సన్‌రైజర్స్‌కు శకునం కుదిరేనా!?


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని