
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 9 AM
1. భద్రతా సిబ్బంది నుంచే ముప్పు!
అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకార సందర్భంగా రాజధాని వాషింగ్టన్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. భద్రతలో పాల్గొనే సిబ్బందే దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న హెచ్చరికలు రావడంతో రక్షణ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అంతర్గత దాడులు జరుగుతాయన్న అంచనాలు ఉన్నా, విధుల్లో పాల్గొనే భద్రత సిబ్బందే తిరుగుబాటు చేసి దాడులకు పాల్పడవచ్చన్న విషయం ఆందోళనకు గురిచేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణం రేపే
2. ఏకచ్ఛత్రాధిపత్యమే ధ్యేయం!
జిన్‌పింగ్ 2013లో చైనా అధ్యక్ష పదవిని స్వీకరించిన వెంటనే తన తొలి విదేశీ పర్యటనకు రష్యాను ఎంచుకున్నారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన ఒక సమావేశంలో ‘మన ఇద్దరి వ్యక్తిత్వాలు దాదాపు ఒక్కటే’ అని జిన్‌పింగ్ పేర్కొన్నట్లు రష్యన్, చైనీస్ సమాచార సాధనాలు వెల్లడించాయి. 2000 సంవత్సరంలో పుతిన్, 2013లో జిన్‌పింగ్ అధికార పగ్గాలు చేపట్టినప్పుడు రష్యా, చైనా దాదాపు ఒకే తరహా సమస్యలు ఎదుర్కొనేవి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. టీకా ప్రాప్తిరస్తు!
అద్భుతం.. అద్వితీయం.. అసామాన్యం! కొవిడ్-19 టీకాను వర్ణించటానికి ఇలాంటి పదాలు ఎన్నయినా సరిపోవు. దశాబ్దాలుగా పీడిస్తున్న ఇన్ఫెక్షన్లకే టీకాలు లేని రోజుల్లో ఇంత సత్వరం టీకా అందుబాటులోకి రావటమంటే మాటలా? మున్నెన్నడూ ఎరగని వైరస్ పుట్టుకురావటం, శరవేగంగా ప్రపంచాన్ని చుట్టబెట్టటం, అది మానవాళి మొత్తాన్ని దిగ్బంధించటం, దాన్ని మట్టుబెట్టటానికి అంతే వేగంగా టీకాను రూపొందించటం.. అంతా కేవలం ఏడాది కాలంలోనే జరగటమనేది అనూహ్యం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
మునుముందు ఎలా ఉంటుందోగాని... అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జో బైడెన్ తొలిరోజే తన మనోభీష్టాన్ని వదలుకోవాల్సి వస్తోంది! ప్రమాణ స్వీకారానికి తనకలవాటైన... తనకిష్టమైన... దాదాపు 40 సంవత్సరాలపాటు రోజూ తాను ప్రయాణించిన.... రైలులో రావాలని నిర్ణయించుకున్నారు బైడెన్! తన సొంత ఊరైన డెలవర్ రాష్ట్రంలోని విల్మింగ్టన్ పట్టణం నుంచి వాషింగ్టన్లో ప్రమాణ స్వీకారానికి అమ్‌ట్రక్ (అమెరికా రైల్వే వ్యవస్థ) రైలులో ప్రయాణించాలనుకున్నారు. అందుకు ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోయాయి. కానీ...తీరా ముహూర్తం వేళకు భద్రతాబృందం నో చెప్పింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి
రాత్రి పనిచేసుకొని బతికే ఆ కూలీల బతుకులు నిద్రలోనే తెల్లారిపోయాయి. పొట్టకూటి కోసం పాదచారుల బాటనే నివాసంగా చేసుకున్న వారి జీవితాలకు అదే చివరి మజిలీ అయింది. రాళ్లుకొట్టి అలసిన వారు.. ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో శాశ్వత విశ్రాంతిలోకి జారుకున్నారు. తమపై ఆధారపడిన కుటుంబాలకు తీరని శోకం మిగిల్చి వెళ్లారు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని సూరత్ జిల్లా కోసంబి పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మంది మృతిచెందారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. 69ఏళ్లు... అయితే ఏంటి?
డెబ్భై ఏళ్ల వయసులో ఎలా ఉండాలి? మనవలూ.. మనవరాళ్లతో కాలక్షేపం చేస్తూ రోజులు సుఖంగా గడిచిపోతే చాలనేది చాలామంది అభిప్రాయం. రజనీచాందీ అలా ఒప్పుకోదు. ఈ వయసు మనకు నచ్చినట్టుగా మనం బతకడంకోసం అంటుంది. ఆ విషయాన్నే చెబుతూ ఆమె ఓ సరికొత్త ప్రయోగం కూడా చేసింది. అదేంటో చూసేయండి... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ప్రాంతీయ విమానాశ్రయాలకు సానుకూలం
రాష్ట్రంలో ప్రాంతీయ విమానాశ్రయాల ఏర్పాటుకు ముందడుగు పడింది. రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) సానుకూలత వ్యక్తం చేసింది. కొన్ని ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ చిన్న విమానాశ్రయాల ఏర్పాటుకు అవకాశం ఉందని దిల్లీ నుంచి వచ్చిన ఏఏఐ అధికారుల బృందం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను ఇచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. పట్టాలకెక్కని విశాఖ జోన్!
విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటులో జాప్యం కొనసాగుతూనే ఉంది. దాన్ని దక్షిణ కోస్తా జోన్‌గా పేర్కొంటూ కేంద్రం దాదాపు రెండేళ్ల కిందటే ప్రకటన చేసింది. ఈ మేరకు అధికారులు డీపీఆర్‌ను కూడా పంపారు. ఆ తర్వాత నుంచి రైల్వే బోర్డులో కదలిక లేకపోవడంతో కొత్త జోన్ అమలు ఎప్పటినుంచి అనేది ప్రశ్నార్థకమవుతోంది. కేంద్రం, రైల్వేశాఖపై ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడం లేదనే విమర్శలున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ఇప్పుడు జోక్యం కుదరదు
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు హైకోర్టులో వాదనలు వినిపించారు. పంచాయతీ ఎన్నికలను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ... కరోనా వ్యాక్సిన్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరాల్ని ఎస్ఈసీ పరిగణనలోకి తీసుకోలేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. గబ్బా టెస్టు: 100 దాటిన టీమ్ఇండియా
బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా ఒక వికెట్ కోల్పోయి 100 పరుగులు చేసింది. శుభ్‌మన్‌గిల్(73*), పుజారా(15*) నిలకడగా ఆడుతున్నారు. భోజన విరామ సమయానికి భారత్ 83/1తో నిలవగా తర్వాత కూడా వీరిద్దరూ జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 42 ఓవర్లకు టీమ్ఇండియా 100/1తో నిలిచింది. విజయానికి ఇంకా 228 పరుగుల దూరంలో ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి