ఫొటోలో చూసినట్లు వరుడు లేడని పెళ్లికి నిరాకరణ
close

తాజా వార్తలు

Updated : 07/03/2021 02:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫొటోలో చూసినట్లు వరుడు లేడని పెళ్లికి నిరాకరణ

పాట్న: ఫొటోలో చూసినట్లు వరుడు లేడని వివాహానికి నిరాకరిస్తూ పెళ్లి కుమార్తె మండపం నుంచి వెళ్లిపోయిన ఘటన బిహార్‌లో జరిగింది. పశ్చిమ చంపారన్‌ జిల్లా బైరియాలోని తదీవానందపుర్‌కు చెందిన ఓ యువతికి మరో గ్రామానికి చెందిన అనిల్‌కుమార్‌ అనే యువకుడితో వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. వాట్సాప్‌లో పంపిన యువకుడి ఫొటో చూసిన యువతి పెళ్లికి సరేనంది. దీంతో వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కుటుంబ సపరివారసమేతంగా వరుడు పెళ్లి మండపానికి చేరుకున్నాడు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్‌ ఎదురైంది. తాళి కట్టబోయే ముందు వరుడిని చూసిన వధువు.. ఫొటోలో చూసినట్లు లేడని, అతడిని పెళ్లి చేసుకోనంటూ మండపం నుంచి దూరంగా పారిపోయింది. ఆమెకు నచ్చజెప్పేందుకు పెళ్లి పెద్దలంతా విఫలయత్నం చేశారు. ఫలితంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకొని ఘర్షణ వాతావరణం నెలకొంది. చివరకు వరుడు పెళ్లి కాకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని