కరోనా నిర్ధారణ.. షాక్‌తో మహిళ మృతి
close

తాజా వార్తలు

Updated : 29/04/2021 17:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా నిర్ధారణ.. షాక్‌తో మహిళ మృతి

తూప్రాన్: కరోనా పాజిటివ్‌ అని తేలగానే తట్టుకోలేక పోయిన ఓ మహిళ కొవిడ్ నిర్ధారణ కేంద్రం వద్దే ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయవిదారక ఘటన మెదక్‌ జిల్లా తూప్రాన్‌లోని కరోనా పరీక్ష కేంద్రం వద్ద చోటుచేసుకుంది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని పోతరాజుపల్లికి చెందిన పల్లపు శ్యామల(30) గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు బుధవారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అనుమానంతో గురువారం ఆమెకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఒక్కసారిగా ఆమె భయాందోళనకు గురై నిమిషాల వ్యవధిలోనే పరీక్షా కేంద్రం వద్దే ప్రాణాలు వదిలింది. శ్యామలకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త నుంచి విడాకులు తీసుకొని తల్లి వద్దే ఉంటోంది. కొవిడ్ నిబంధనల ప్రకారం పోతురాజుపల్లి మున్సిపాలిటీ పరిధిలో శ్యామలకు అంత్యక్రియలు నిర్వహించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని