శ్రీకాకుళం జిల్లా బలరాంపురంలో ఉద్రిక్తత
close

తాజా వార్తలు

Published : 11/02/2021 18:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రీకాకుళం జిల్లా బలరాంపురంలో ఉద్రిక్తత

కోటబొమ్మాళి: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కిష్టుపురం పంచాయతీ పరిధిలోని బలరాంపురంలో ఉద్రిక్తత నెలకొంది. తెదేపా సానుభూతి పరుల ఇళ్లపై వైకాపా వర్గీయులు దాడి చేశారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కిష్టుపురం సర్పంచ్‌గా వైకాపా మద్దతుదారు వెంకటరావు విజయం సాధించారు. 
ఈ పంచాయతీలోని పది వార్డులకు గాను ఆరు వార్డులను తెదేపా గెలుచుకుంది. ఈ నేపథ్యంలో 
తెదేపాకు చెందిన మోహనరావుకు ఉప సర్పంచ్‌ పదవి ఇచ్చారు. 

అయితే గతంలో వైకాపా ఉప సర్పంచ్‌గా ఉన్న ధర్మారావుకు పదవి ఎందుకు ఇవ్వలేదని వైకాపా వర్గీయులు గురవారం ఘర్షణకు దిగారు. ఈ క్రమంలోనే తెదేపా సానుభూతి పరుల ఇళ్లపై దాడి చేశారు. ఈ దాడిలో కైలాసరావు, నవీన్‌కు తీవ్ర గాయాలు కాగా శ్రీకాకుళం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరో ముగ్గురు గణేశ్‌, శివ, రవిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు.

ఇవీ చదవండి..

మేం చెప్పిందే జరిగింది: బండి సంజయ్‌

అక్రమాలను ఎదిరిస్తే కేసులా?: చంద్రబాబు


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని