Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179630
            [news_title_telugu_html] => 

వ్యవసాయానికో ఆలోచన

[news_title_telugu] => వ్యవసాయానికో ఆలోచన [news_title_english] => [news_short_description] => వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో నూతన విధానాలు, పద్ధతులను ప్రవేశపెట్టే వినూత్న ఆలోచన మీ దగ్గర ఉందా...అయితే దానికి రెక్కలు తొడిగి దేశమంతా ఎగిరేలా చేసేందుకు ‘జాతీయ వ్యవసాయ పరిశోధన, నిర్వహణ సంస్థ’(నార్మ్‌) ప్రోత్సహిస్తుంది [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,27,26, ) )
వ్యవసాయానికో ఆలోచన - EENADU
close
వ్యవసాయానికో ఆలోచన

సాగులో వినూత్న ఆలోచనలకు ప్రోత్సాహం
‘అగ్రి ఉడాన్‌’ కార్యక్రమానికి శ్రీకారం
ఈ నెలాఖరున హైదరాబాద్‌లో ప్రారంభం
నార్మ్‌ ‘ఎ-ఐడియా’ అంకురాలకు దేశవ్యాప్త గుర్తింపు
ఈనాడు - హైదరాబాద్‌

వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో నూతన విధానాలు, పద్ధతులను ప్రవేశపెట్టే వినూత్న ఆలోచన మీ దగ్గర ఉందా...అయితే దానికి రెక్కలు తొడిగి దేశమంతా ఎగిరేలా చేసేందుకు ‘జాతీయ వ్యవసాయ పరిశోధన, నిర్వహణ సంస్థ’(నార్మ్‌) ప్రోత్సహిస్తుంది. ఇందుకోసం ‘అగ్రి ఉడాన్‌’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని జాతీయస్థాయిలో నిర్వహించనుంది. దీనిని ఈ నెలాఖరున ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాజేంద్రనగర్‌లోని నార్మ్‌లో భాగంగా ‘అసోసియేషన్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్‌ ఆన్‌ అగ్రికల్చర్‌’(‘ఎ-ఐడియా’) అనే సొసైటీ ఉంది. దీనిద్వారా ‘అగ్రి ఉడాన్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ‘ఎ-ఐడియా’ను కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ సహకారంతో సొసైటీగా గతంలో నమోదు చేశారు. వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు సంబంధించిన 13 ఉప విభాగాల్లో నూతన ఆవిష్కరణలకు కార్యరూపం కల్పించేందుకు ఇది కృషి చేస్తోంది. ఈ విభాగాల్లో దేనిలోనైనా వినూత్న పద్ధతుల ద్వారా రైతులకు లేదంటే ప్రజలకు మరింత సులువుగా సేవలు అందించవచ్చనే ఆలోచన ఎవరి దగ్గర ఉన్నా దానికి ఒక రూపం ఇచ్చి క్షేత్రస్థాయిలో అమలుచేయడానికి ఎ-ఐడియా ప్రోత్సహిస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇలాంటి వినూత్న ఆలోచనలతో 771 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 60 అంకురాలను ఎంపిక చేయగా దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ 60లో 18 అంకురాలను క్షేత్రస్థాయిలోకి తెచ్చారు. వీటిని మార్కెటింగ్‌ చేయడానికి 105 మంది ముందుకొచ్చి రూ.9.35 కోట్లను పెట్టుబడిగా పెట్టారు. నాబార్డు, ఫిక్కీ, యస్‌ బ్యాంక్‌ వంటివి ఎ-ఐడియాకు భాగస్వాములుగా పనిచేస్తున్నాయి. ఎ-ఐడియాను దేశప్రజలందరికీ మరింత చేరువ చేసేందుకు ‘భారత వ్యవసాయ పరిశోధనా మండలి’(ఐసీఏఆర్‌), నార్మ్‌లు సంయుక్తంగా అగ్రి-ఉడాన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాయి. దీనిపై వచ్చే నెలలో 7 నగరాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ ప్రదర్శనల్లో వినూత్న ఆలోచనలతో వచ్చే వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆసక్తి గల వారు ఆన్‌లైన్‌లో ఎ-ఐడియాకు దరఖాస్తు చేయవచ్చు. వచ్చే అక్టోబరులో ఈ దరఖాస్తులను వడపోసి ఆసక్తి గల వాటిని ఎంపిక చేస్తారు. నవంబరులో తుది ఎంపిక చేసి కార్యరూపంలోకి తెచ్చేందుకు లక్ష్యాలను నిర్దేశిస్తారు. వచ్చే డిసెంబరు, జనవరిలో వాటిపై ప్రయోగాలు చేస్తారు. వచ్చే ఫిబ్రవరిలో వాటిని మార్కెట్‌లోకి, రైతుల పొలాల్లోకి ఎలా తీసుకెళతారో వివరించే ప్రదర్శనలను బెంగళూరు, ముంబయిలో ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.

* కార్యక్రమం పేరు - అగ్రి ఉడాన్‌
* ప్రారంభం   - ఈ నెలాఖరులో
* ఏం చేస్తారు  - వ్యవసాయానికి సంబంధించి 13 ఉప విభాగాల్లో వినూత్న ఆలోచనలను స్వీకరిస్తారు
* ఉప విభాగాలు -   వ్యవసాయంలో సుస్థిర పెట్టుబడులు, స్మార్ట్‌ వ్యవసాయం, వినూత్న ఆహార సాంకేతికత, మార్కెట్‌కు సరఫరా సాంకేతికత, మత్స్యరంగం, భూసార, నీటి పరీక్షల సాంకేతికత, వ్యవసాయంలో ఐటీ, పాడి పరిశ్రమ, పట్టణ, నిలువు సేద్యం, అగ్రి బయోటెక్‌, పంటకోతల అనంతర సాంకేతికత, వ్యవసాయోత్పత్తుల చిల్లర మార్కెట్లు, వ్యవసాయ యంత్రాలు. 
* వచ్చే నెలలో ప్రదర్శనలు ఏర్పాటు చేసే నగరాలు - బెంగళూరు, పుణె, పట్నా, లఖ్‌నవూ, గుడ్‌గావ్‌, భోపాల్‌, గువాహటి 
* ఉద్దేశం - వినూత్న ఆలోచనలను ఎంపిక చేసి దేశవ్యాప్తంగా అమలయ్యేలా చూడటం

రైతుల ఆదాయాన్ని పెంచేలా ఉండాలి 

మన రైతులు టమాటాలు పండిస్తారు. ఎక్కువగా పండినప్పుడు వాటికి ధర లేక నష్టపోతున్నారు. అలాంటి సమయంలో వాటి ఉత్పత్తులను సులభంగా తయారుచేసి ప్రజలకు అమ్మి రైతులకు ఆదాయం పెంచడానికి ఇప్పుడున్న విధానాలు కాకుండా ఇంకా సులభంగా ఎలా చేయవచ్చనే వినూత్న ఆలోచన ఎవరికైనా ఉంటే దానిని ఎ-ఐడియాకు చెప్పవచ్చు. ఇలా అన్నదాతల ఆదాయాన్ని పెంచే ఏ ఆలోచనకైనా ప్రోత్సాహమిస్తాం. దేశంలో ఏ ప్రాంతంవారికైనా ఎ-ఐడియాలో అవకాశం కల్పిస్తాం. 

-సీహెచ్‌. శ్రీనివాసరావు, సంచాలకుడు, నార్మ్‌

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.