close

తాజా వార్తలు

ఓపక్క బన్నీ-పూజ..మరోపక్క ఈఫిల్ ట‌వ‌ర్‌

హైదరాబాద్‌: ‘అల వైకుంఠ‌పుర‌ములో’ జంటగా నటిస్తున్న అల్లు అర్జున్‌, పూజా హెగ్డే ఈఫిల్‌ టవర్‌ వద్ద సందడి చేశారు. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. తమన్‌ బాణీలు అందిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా పాట ‘సామజవరగమన..’కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ పాట యూట్యూబ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. కాగా ఈ పాటను పారిస్‌లో షూట్‌ చేశారు. అక్కడి లిడో డ్యాన్సర్ల నేప‌థ్యంలో షూట్ జరిగిందట. ఈ డ్యాన్స్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. వాళ్లతో కలిసి ఆడిపాడిన తొలి దక్షిణాది స్టార్‌ బన్నీ అని చిత్ర వర్గాలు తెలిపాయి.

కాగా ఈ పాట గురించి పూజా హెగ్డే సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. ఈఫిల్‌ టవర్‌ వద్ద బన్నీతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ఈఫిల్‌ టవర్‌కి ‘సామజవరగమన..’లాంటి పాట ఏ మాత్రం తీసిపోదని పోస్ట్‌ చేశారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.