కొవాగ్జిన్‌ మరో ఘనత
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవాగ్జిన్‌ మరో ఘనత

భారత్‌, బ్రిటన్‌ స్ట్రెయిన్‌లపై సమర్థంగా పనిచేస్తోంది  
ఎన్‌ఐవీ, ఐసీఎంఆర్‌ సంయుక్త అధ్యయనంలో వెల్లడి

దిల్లీ: భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా భారత్‌, బ్రిటన్‌ రకం కరోనా స్ట్రెయిన్‌లపై సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ), ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఐసీఎంఆర్‌) సంయుక్తంగా చేసిన అధ్యయనంలో ఇది వెల్లడైనట్లు భారత్‌ బయోటెక్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. భారత్‌లో వెలుగుచూసిన బి.1.617, బ్రిటన్‌ రకం బి.1.1.7 స్ట్రెయిన్‌లనూ ఈ వ్యాక్సిన్‌ అంతం చేయగలదని అధ్యయనం స్పష్టం చేసిందని వివరించింది. ‘కొవాగ్జిన్‌కు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. శాస్త్రీయ పరిశోధనల తర్వాత కొత్తగా వెలుగుచూసిన వేరియంట్లపై ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలింది. కొవాగ్జిన్‌ ఘనతల్లో ఇది మరొకటి’ అని భారత్‌ బయోటెక్‌ సహ వ్యవస్థాపకురాలు సుచిత్ర ఎల్ల ట్వీట్‌ చేశారు.
భారత్‌ బయోటెక్‌తో హెస్టర్‌ చర్చలు
వ్యాక్సిన్‌ తయారీకి గుజరాత్‌ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు హెస్టర్‌ బయోసైన్సెస్‌ వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొవాగ్జిన్‌ తయారు చేస్తున్న భారత్‌ బయోటెక్‌తో చర్చలు ప్రారంభించినట్లు తెలిపింది. భారత్‌ బయోటెక్‌ నుంచి సాంకేతికత బదిలీ ద్వారా వ్యాక్సిన్‌ తయారీ అవకాశాలు పరిశీలిస్తున్నామని హెస్టర్‌ బయోసైన్సెస్‌ సీఈఓ, ఎండీ రాజీవ్‌ గాంధీ వెల్లడించారు. పౌల్ట్రీ వ్యాక్సిన్‌ల తయారీలో ఇది దేశంలో రెండో అతిపెద్ద సంస్థ.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు