విద్యుత్‌పై పర్యవేక్షణకు నేతాగణం

ప్రధానాంశాలు

విద్యుత్‌పై పర్యవేక్షణకు నేతాగణం

ఎంపీలు, ఎమ్మెల్యేలతో జిల్లా కమిటీలు

సత్వరం ఏర్పాటుకు కేంద్రం ఆదేశాలు

పంపిణీ నష్టాల తగ్గింపు లక్ష్యంగా అడుగులు

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్‌ రంగంలో తొలిసారి ఎంపీలు, ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తోంది. ప్రతి జిల్లాస్థాయిలో అక్కడి పార్లమెంటు సభ్యుడు ఛైర్మన్‌గా ‘జిల్లా విద్యుత్‌ కమిటీ’లను ఏర్పాటుచేయాలని అన్ని రాష్ట్రాల ఇంధనశాఖలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తక్షణం రాష్ట్రస్థాయిలో ఉత్తర్వులివ్వాలని సూచించింది. జిల్లా స్థాయిలో విద్యుత్‌ సరఫరా, పంపిణీ వ్యవస్థల అభివృద్ధి, నిరంతర కరెంటు సరఫరా, సంబంధిత పథకాల పర్యవేక్షణంతా ఈ కమిటీనే చూస్తుందని స్పష్టం చేసింది. ‘‘రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) ఈ కమిటీల ఏర్పాటు, నిర్వహణను పర్యవేక్షిస్తుంది. ఒక జిల్లాలో ఒకరికి మించి ఎంపీలుంటే సీనియర్‌ని కమిటీకి ఛైర్మన్‌గా, ఇతర ఎంపీలను కోఛైర్మన్లుగా నియమించాలి. జిల్లాలోని ఎమ్మెల్యేలను సభ్యులుగా, కలెక్టర్‌ను కమిటీ సభ్య కార్యదర్శిగా, జిల్లాస్థాయి విద్యుత్‌ చీఫ్‌ ఇంజినీరు(సీఈ)ని కన్వీనర్‌గా నియమించాలి. ప్రతి 3 నెలలకు తప్పనిసరిగా కమిటీ సమావేశాలు జరిగేలా కలెక్టర్‌, సీఈ ఏర్పాట్లు చేయాలి’’ అని పేర్కొంది. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో జిల్లా విద్యుత్‌ కమిటీల ఏర్పాటుకు త్వరలో డిస్కంలకు ఉత్తర్వులిస్తామని రాష్ట్ర ఈఆర్‌సీ ఛైర్మన్‌ శ్రీరంగారావు ‘ఈనాడు’కు చెప్పారు. పలు రాష్ట్రాల్లో విద్యుత్‌ ‘సరఫరా, పంపిణీ’(టీడీ) నష్టాలు 10 నుంచి 35 శాతం వరకూ ఉంటున్నాయి. కారణాలేంటో డిస్కంలు సరిగా చెప్పడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లా విద్యుత్‌ కమిటీలు ప్రతి 3 నెలలకోమారు సమావేశమై టీడీ నష్టాల తగ్గింపు, విద్యుత్‌ పథకాల అమలుకు చర్యలు చేపట్టాలని కేంద్రం స్పష్టం చేసింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని