సామాజిక దూరం.. వినూత్నంగా ఆశీర్వాదం
close

తాజా వార్తలు

Published : 16/11/2020 00:20 IST

సామాజిక దూరం.. వినూత్నంగా ఆశీర్వాదం

 

దుబాయ్‌: కరోనా నేపథ్యంలో పలు దేశాల్లో పెళ్లిళ్లు, ఇతర వేడుకలపై రకరకాల ఆంక్షలున్నాయి. అయితే కరోనాకు మందే కొందరి వేడుకలు నిశ్చయం కావడంతో ఆంక్షల మధ్యే కొందరు నిరాడంబరంగా నిర్వహించుకుంటున్నారు. యూఏఈలో స్థిరపడ్డ భారత్‌కు చెందిన ఓ జంట వినూత్నంగా తమ పెళ్లి క్రతువును నిర్వహించింది. వేడుకల్లో సామాజిక దూరం సాధ్యం కాకపోతుండడంతో ‘డ్రైవ్‌ బై వెడ్డింగ్‌’ పేరుతో తమ పెళ్లిని కొత్తగా జరుపుకున్నారు. బంధువులు, స్నేహితులు తమను కలవకుండా దూరం నుంచే  ఆశీర్వదించే విధంగా తమ వివాహ వేడుకను నిర్వహించుకున్నారు. కేరళకు చెందిన మహ్మద్‌ జాజెమ్‌, అల్మాస్ అహ్మద్‌లు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కరోనా వల్ల దుబాయిలో వేడుకలు, సమావేశాలపై ఆంక్షలు ఉన్నాయి. సామాజిక దూరం పాటిస్తూ వేడుకలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుతినిచ్చింది. దీంతో వారు కొత్తగా ఆలోచించి బంధువులు, స్నేహితులను కారులో నుంచే ఆశీర్వదించేవిధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. నవ దంపతులు ఇంటి వెలుపల ఏర్పాటు చేసిన పూల అలంకరణపై నిలుచున్నారు. దీంతో వారి బంధువులు, స్నేహితులు సామాజిక దూరం పాటిస్తూ కార్ల నుంచి బయటికి దిగకుండానే కొత్త జంటను ఆశీర్వదించడంతో పాటు ఫొటోలు తీసుకొని వెళ్లిపోయారు. లండన్‌లో జరిగిన ఇలాంటి వివాహ వేడుకను చూసి ఆదర్శంగా తీసుకున్నామని నవ దంపతులు తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని