కరోనా విలయం: 50లక్షలు దాటిన కేసులు!

తాజా వార్తలు

Updated : 16/09/2020 10:03 IST

కరోనా విలయం: 50లక్షలు దాటిన కేసులు!

24గంటల్లో 90వేల కేసులు, 1290 మంది మృతి

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 11,16,842 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా వీటిలో 90,122 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో బుధవారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 50,20,359కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటికే 39లక్షల మంది కోలుకోగా మరో 9లక్షల 95వేల క్రియాశీల కేసులు ఉన్నట్లు తెలిపింది. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 82వేల మంది కోలుకున్నారు. ఇక దేశంలో కరోనా మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఒక్కరోజులో 1290 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. 24గంటల వ్యవధిలో ఇన్ని మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. కాగా, రోజువారీ మరణాలు 1200దాటడం ఇది మూడోసారి. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా సోకి మృతిచెందిన వారిసంఖ్య 82,066కి చేరింది. అయితే, కొవిడ్‌-19తో మరణిస్తున్న వారిలో దాదాపు 70శాతానికి పైగా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారేనని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 78.5శాతానికి చేరడం ఉపశమనం కలిగించే విషయం. అయితే, మరణాల రేటు మాత్రం 1.63శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 5కోట్ల 94లక్షల శాంపిళ్లకు కొవిడ్‌ టెస్టులు పూర్తిచేసినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) వెల్లడించింది.

ఇదిలాఉంటే, ప్రపంచంలో కరోనా వైరస్‌ అధిక తీవ్రత ఉన్న అమెరికాలో ఇప్పటికే 66లక్షల కేసులు బయటపడగా వీరిలో లక్షా 95వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక భారత్‌లో ప్రస్తుతం పాజిటివ్‌ కేసుల సంఖ్య 50లక్షలు దాటింది. కరోనా మరణాలు అత్యధికంగా అమెరికాలో చోటుచేసుకోగా బ్రెజిల్‌లో లక్షా33వేలు, భారత్‌లో 82వేల మరణాలు సంభవించాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని