
తాజా వార్తలు
గగన్‌యాన్: వ్యోమగాముల శిక్షణ తిరిగి ప్రారంభం
మాస్కో: భారత్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ కోసం ఎంపికైన నలుగురు వ్యోమగాముల శిక్షణను రష్యాలో తిరిగి ప్రారంభించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి చివర్లో వ్యోమగాముల శిక్షణకు తాత్కాలికంగా విరామం ప్రకటించగా... ఈ శిక్షణ మళ్లీ ప్రారంభమైందని రష్యన్ స్పేస్ ఏజెన్సీ రోస్కోస్మోస్ వెల్లడించింది. ఇస్రోతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వ్యోమగాములకు శిక్షణ ప్రారంభించినట్లు రోస్కోస్మోస్ తెలిపింది. నలుగురు భారతీయ వ్యోమగాములు ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించింది. జీసీటీసీలో కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని నిబంధనలు పాటిస్తున్నామని, భౌతిక దూరం, పరిశుభ్రత చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న భారత వ్యోమగామి ఫొటోను విడుదల చేసింది.
Tags :
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
- 2-1 కాదు 2-0!
- కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు
- ఇంకా నయం.. వారినీ తీసేస్తారనుకున్నా: గంభీర్
- రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
- ఈసారి అత్యధిక ధర పలికే ఆటగాడితడే!
- శంషాబాద్‌లో సిరాజ్‌కు ఘన స్వాగతం..
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
