ఆ లేఖ నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది: పవార్‌

తాజా వార్తలు

Published : 14/10/2020 01:58 IST

ఆ లేఖ నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది: పవార్‌

దిల్లీ: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ రాసిన లేఖపై ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ తీవ్రంగా స్పందించారు. గవర్నర్‌ లేఖలో ప్రస్తావించిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన ప్రధాని మోదీకి మరో లేఖ రాశారు. ‘సీఎంకు రాసిన లేఖలో గవర్నర్‌ కోశ్యారీ ఉపయోగించిన భాషను మీరు కూడా తప్పక గమనించి ఉంటారని నేను అనుకుంటున్నాను. మన రాజ్యాంగంలో లౌకిక అనే పదం అన్ని మతాల్ని, వర్గాల్ని సమానత్వం కల్పిస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి రాజ్యాంగంలోని ఆయా పదాలను సమర్థించాలి. కానీ, దురదృష్టవశాత్తూ గవర్నర్‌ కోశ్యారీ ముఖ్యమంత్రికి రాసిన లేఖ ఓ రాజకీయ నాయకుడికి రాసినట్లుగా ఉంది. దేవాలయాల పునఃప్రారంభానికి సంబంధించిన విషయాన్ని ఆయన సీఎం దృష్టికి తీసుకురావడంపై నేను ఏకీభవిస్తున్నాను. ఆ విషయంలో గవర్నర్‌కు స్వతంత్ర అభిప్రాయాలు ఉండటంలో తప్పులేదు. కానీ ఆయన లేఖలో ఉపయోగించిన భాష మాత్రం నన్ను ఎంతో షాక్‌కు గురిచేసింది’ అని పవార్‌ ప్రధాని మోదీకి రాసిన లేఖలో ప్రస్తావించారు. మహారాష్ట్రలో ఆలయాలను తెరవడం గురించి గవర్నర్‌ కోశ్యారీ, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే మధ్య లేఖల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. 

ఉద్ధవ్‌జీ.. లౌకికవాదిగా మారారా?Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని