close

తాజా వార్తలు

Published : 22/01/2021 20:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏనుగు చెవికి నిప్పు.. వీడియో వైరల్‌

నీలగిరి: తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఇటీవల మృతిచెందిన ఏనుగు చెవి భాగానికి నిప్పు గాయం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. నీలగిరి జిల్లాలోని టైగర్‌ రిజర్వులోని ఓ ఏనుగు వీపునకు గాయం ఉండటంతో అటవీశాఖ అధికారులు దానికి వైద్యచికిత్సలు అందించి పర్యవేక్షించారు. నీలగిరి జిల్లా మసినకుడి ప్రాంతంలోని జనావాసాల్లో తిరుగుతున్న ఆ ఏనుగును ఈనెల 19న రిజర్వు ప్రాంతానికి తరలిస్తుండగా మరణించింది. అయితే ఏనుగు చెవి భాగంలో నిప్పుతో చేసిన గాయం ఉండటాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో టైరుకు నిప్పు పెట్టి దానిని ఏనుగు మీదకు విసిరే దృశ్యాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. జనావాసాల్లో తిరుగుతున్న ఏనుగును తరిమే ప్రయత్నంలో ఇలా చేశారా? లేక వేరే ఏదైనా కారణంతో ఇలా చేశారా? అనే కోణంలో అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇవీ చదవండి..
మాజీ సీజేఐ గొగొయ్‌కి జెడ్‌+ భద్రత 

అన్ని మెసెంజర్లు ఒకే దాంట్లో!
Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని