close

తాజా వార్తలు

Published : 25/01/2021 01:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గనిలోనే 2వారాలు.. 11 మంది సురక్షితం!

మరో 11 మంది కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు

బీజింగ్‌: రెండు వారాల క్రితం చైనాలోని ఓ బంగారు గనిలో చిక్కుకున్న 22 మందిలో.. నేడు 11 మంది సురక్షితంగా బయటపడ్డారు. వారంతా నీరసించి బలహీనంగా మారడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొంత మందికి గాయాలైనట్లు గుర్తించారు. మరో 11 మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వీరిలో ఒకరు చనిపోయినట్లు భావిస్తున్నారు.

జనవరి 10న షాన్‌డాంగ్‌ ప్రావిన్స్‌లోని క్విజియా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ బంగారు గనిలో ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. దీంతో అందులో పనిచేస్తున్న 22 మంది కూలీలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. గని పూర్తిగా శిథిలాలతో మూసుకుపోయింది. కూలీలు దాదాపు వంద అడుగుల లోతులో ఉండిపోయారు. దీంతో వారిని రక్షించడం కష్టంగా మారింది. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది.. శిథిలాలను తొలగించి వారికి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో గని లోపలికి గాలి, వెలుతురు వెళ్లేలా.. మరోవైపు డ్రిల్లింగ్‌ చేపట్టారు. 10 మంది కూలీలు కాంటాక్ట్‌లోకి రావడంతో వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. ఆహారం, మందులు పంపిస్తున్నారు. ప్రస్తుతం బయటకు వచ్చిన వారిలో ఈ పది మంది ఉన్నారా.. లేదా.. అన్నది తెలియాల్సి ఉంది.

చైనా మైనింగ్‌ పరిశ్రమలో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. ఈ ప్రమాదాల్లో ఏడాదికి 5వేల మంది కూలీలు ప్రాణాలు కోల్పోతుండటం గమనార్హం. గతేడాది సెప్టెంబరులో చెంగ్‌కింగ్‌లో జరిగిన గని ప్రమాదంలో 39 మంది కూలీలు మరణించారు.

ఇవీ చదవండి...
హఫీజ్‌ సయీద్‌ అనుచరులకు పాకిస్థాన్‌లో జైలు శిక్ష

భారత్‌లో డ్యామ్‌లకు కాలం చెల్లుతోంది



Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని