close

తాజా వార్తలు

Updated : 05/03/2021 04:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రైవేటులో 75% కోటా: ఫిక్కీ ఏమందంటే..!

దిల్లీ: ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని హరియాణా ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టం పారిశ్రామిక రంగానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఫిక్కీ) స్పష్టంచేసింది. అంతేకాకుండా ఈ నిర్ణయం రాష్ట్రంలో పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడింది. ‘పోటీ ప్రపంచంలో పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు ఉత్తమ మానవ వనరులను ఎంపిక చేసుకొని విజయవంతంగా తమ కార్యాకలాపాలను కొనసాగించేందుకే మొగ్గుచూపుతారు. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సంస్థలు ఇతర రాష్ట్రాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది’ అని ఫిక్కీ అధ్యక్షుడు ఉదయ్‌ శంకర్‌ అన్నారు. ప్రైవేటు ఉద్యోగాల్లో 75శాతం స్థానికులకు కేటాయించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, అంతేకాకుండా భారత పౌరులకు దేశంలో ఎక్కడైనా పనిచేసే స్వేచ్ఛకు ఇది వ్యతిరేకంగా ఉన్నట్లు తాము భావిస్తున్నామన్నారు.

ప్రైవేటు రంగం ఉద్యోగాల్లో స్థానికులకే 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ హరియాణా ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆమోదముద్ర వేశారు. ప్రైవేటు రంగంలో నెలకు రూ.50 వేల వేతనం కంటే తక్కువ వచ్చే ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ఖట్టర్‌ ప్రభుత్వం గతేడాది ఉద్యోగ కల్పనకు సంబంధించిన బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించడంతో గవర్నర్‌ ముందుకు వెళ్లింది. ఈ మేరకు గవర్నర్‌ ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. దీనిపై పారిశ్రామికవేత్తల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని