సైనిక దళ ప్రధాన  కార్యాలయం తరలింపు

తాజా వార్తలు

Published : 20/02/2020 20:22 IST

సైనిక దళ ప్రధాన  కార్యాలయం తరలింపు

దిల్లీ కంటోన్మెంటు ప్రాంతానికి మారనున్న ఆర్మీ హెడ్‌ క్వార్టర్స్‌

దిల్లీ: భారతీయ సైన్యానికి సంబంధించిన ప్రధాన కార్యాలయాన్ని నూతన భవనంలోకి తరలించాలని రక్షణ శాఖ నిర్ణయించింది. మిలిటరీ విషయాల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ‘సైనిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ’ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా రక్షణ శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు  రైసినా హిల్స్‌ లోని సౌత్‌ బ్లాక్‌లో ఉన్న సైనిక ప్రధాన కార్యాలయాన్ని ఇకపై కంటోన్మెంట్‌ ప్రాంతానికి మార్చనున్నారు. 39 ఎకరాల్లో నిర్మించనున్న సైనిక దళ కార్యాలయ నూతన భవనానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం భూమిపూజ నిర్వహించనున్నారు. కంటోన్మెంట్‌ ప్రాంతంలోని మానెక్‌షా సెంటర్‌ సమీపంలో నిర్మించనున్న ఈ భవన నిర్మాణం ఐదు సంవత్సరాల్లో పూర్తి కానుంది. 

అంతేకాకుండా ఇప్పటి వరకూ భారత రక్షణ శాఖలోని త్రివిధ దళాల కార్యాలయాలకూ చిరునామాగా ఉన్న సౌత్‌ బ్లాక్‌ నుంచి... మిగిలిన రెండు భద్రతా దళాలయిన వైమానిక, నౌకాదళ ప్రధాన కార్యాలయాలను కూడా తరలించనున్నారు. ఈ ప్రక్రియ రానున్న ఐదు సంవత్సరాలలో పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని