24గంటల్లో 12,881 కేసులు, 334మరణాలు!

తాజా వార్తలు

Updated : 18/06/2020 11:21 IST

24గంటల్లో 12,881 కేసులు, 334మరణాలు!

దేశంలో 12,237కి చేరిన కరోనా మరణాలు

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్నిరోజులుగా దేశంలో నిత్యం 11వేలకుపైగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 12,881 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్‌ బయటపడిన అనంతరం ఒక్కరోజే ఇన్నికేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో కరోనా వైరస్‌ బారినపడిన మొత్తం బాధితుల సంఖ్య 3,66,946కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో ఇప్పటి వరకు 1,94,324మంది కోలుకోగా మరో 1,60,384మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో కొవిడ్‌ మరణాల సంఖ్య కలవరపెడుతోంది. తాజాగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 334మంది మృత్యువాతపడ్డారు. గురువారం నాటికి దేశంలో కొవిడ్‌-19 మరణాల సంఖ్య 12,237కి చేరినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో కొవిడ్‌ మరణాల రేటు 3.3శాతంగా ఉంది.

మూడు రాష్ట్రాల్లోనే 9వేలకు పైగా మరణాలు..
దేశంలో నమోదవుతున్న మొత్తం కరోనా మరణాల్లో అత్యధికంగా ఈ మూడు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 12,237 మంది మృత్యువాతపడగా కేవలం మహారాష్ట్ర, గుజరాత్‌, దిల్లీలలోనే 9115 కరోనా మరణాలు సంభవించాయి. దేశంలో ఇప్పటిదాకా సంభవించిన మొత్తం కరోనా మరణాల్లో కేవలం ఒక్క మహారాష్ట్రలోనే 5651 చోటుచేసుకున్నాయి. ఇక దేశ రాజధాని దిల్లీలో 1904, గుజరాత్‌లో 1560మంది చనిపోయారు.

ఇదిలా ఉంటే, కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్యలో భారత్‌ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. రోజువారీగా చూస్తే, అమెరికా, బ్రెజిల్‌, భారత్‌లలోనే నిత్యం పదివేలు చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచంలో కరోనా మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న దేశాల జాబితాలో భారత్‌ ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని