కట్నం తీసుకున్నారా?అయితే ప్రభుత్వానికి లెక్క చెప్పండి!

తాజా వార్తలు

Published : 25/10/2021 17:48 IST

కట్నం తీసుకున్నారా?అయితే ప్రభుత్వానికి లెక్క చెప్పండి!

లఖ్‌నవూ: వరకట్న వ్యవస్థని నిర్మూలించేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 2004 తర్వాత వివాహం చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు.. పెళ్లి సమయంలో తీసుకున్న కట్నం, వాటి పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందించాలని ఓ ఉత్తర్వులో పేర్కొంది. వివిధ శాఖల్లో పనిచేస్తున్న సుమారు 10 వేల మంది ఉద్యోగులు, అధికారులు ఇప్పుడు ప్రభుత్వానికి వరకట్న వివరాలు సమర్పించాల్సి ఉంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ పేరిట నోటీసులు జారీ చేశారు.

ఏ ఏడాదిలో వివాహం జరిగింది? ఎటువంటి పరిస్థితుల్లో కట్నం తీసుకోవాల్సి వచ్చింది? వంటి ప్రశ్నలకు సమాధానాలివ్వాలని నోటీసుల్లో ఉంది. 2004 ఏప్రిల్ తర్వాత వివాహం చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా ఈ వాంగ్మూల పత్రాన్ని తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ ఇవ్వకపోతే అతడిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. అక్టోబర్‌లోగా అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు ఆ వివరాలను సమర్పించాలన్నారు. అయితే, గతంలో ఆస్తుల వివరాలను తీసుకున్నారని, ఇప్పుడు వరకట్నం వివరాలుకోరడంపై ఉద్యోగవర్గాలు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నాయి.

సాంఘిక దురాచారమైన వరకట్న వ్యవస్థను నిర్మూలించడానికి యూపీ ప్రభుత్వం 1999లో వరకట్న నిషేధ చట్టం రూపొందించింది. 2004 మార్చి 31న ఈ చట్టానికి సవరణ చేసింది. అందులోని రూల్‌ 5 ప్రకారం.. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగంలో చేరే సమయంలో ఎలాంటి కట్నం తీసుకోలేదని వాంగ్మూల పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని