Corona: మూడో రోజూ 3 లక్షలలోపు కేసులు

తాజా వార్తలు

Updated : 19/05/2021 10:05 IST

Corona: మూడో రోజూ 3 లక్షలలోపు కేసులు

రికార్డు స్థాయిలో 4,529 మంది మృత్యుఒడికి..

దిల్లీ: దేశంలో వరుసగా మూడో రోజు కొత్త కేసులు 3 లక్షల లోపు నమోదయ్యాయి. అయితే భారీ సంఖ్యలో మరణాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 4,529 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. కొత్త కేసులు 3 లక్షలలోపే నమోదైనప్పటికీ.. క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా పెరిగాయని బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 

మంగళవారం 20,08,296 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..2,67,334 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. గత ఐదు రోజులుగా తగ్గుముఖం పట్టిన కేసులు..నిన్న స్వల్పంగా పెరిగాయి. మరోవైపు, మరణాల సంఖ్య భారీగా పెరగడం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. నిన్న అత్యధికంగా 4,529 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. దేశంలో ఇప్పటివరకు 2.54 కోట్ల మందికి పైగా వైరస్ బారిన పడగా..2,83,248 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఒక్క మహారాష్ట్రలోనే 1,291 మరణాలు సంభవించాయి. అక్కడ కూడా కొత్త కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ..మరణాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. కర్ణాటకలో కూడా 500 మందికిపైగా ప్రాణాలు వదిలారు. 

కొత్త కేసుల సంఖ్య అదుపులో ఉండటంతో కొవిడ్‌తో బాధపడుతున్న వారి సంఖ్య 32,26,719కి చేరింది. క్రియాశీల రేటు 13.29 శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజే 3,89,851 మంది కోలుకోగా..రికవరీల సంఖ్య 2.19కోట్లకు పైబడింది. రికవరీరేటు 85.60 శాతానికి చేరింది. మరోవైపు, నిన్న 13,12,155 మందికి టీకా డోసులు అందాయి. మొత్తంగా 18,58,09,302 మంది టీకా వేయించుకున్నారని కేంద్రం తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని