కొవిడ్‌ టీకా తీసుకున్న ప్రధాని మోదీ

తాజా వార్తలు

Updated : 01/03/2021 09:21 IST

కొవిడ్‌ టీకా తీసుకున్న ప్రధాని మోదీ

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం కొవిడ్‌ టీకా వేయించుకున్నారు. దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా  60 ఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న దీర్ఘకాల వ్యాధిగ్రస్థులకు ఈ రోజు నుంచి టీకా ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రధాని తొలి డోసు టీకాను తీసుకున్నారు.

తాను తొలి డోసు టీకా తీసుకున్నట్లు మోదీ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. కొవిడ్‌కి వ్యతిరేకంగా మన దేశ వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. అర్హులందరూ కొవిడ్‌ టీకా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మనమందరం కలిసి భారత్‌ను కొవిడ్‌ రహిత దేశంగా తీర్చిదిద్దుదామని ఆయన పిలుపునిచ్చారు.

కొవాగ్జిన్‌ టీకా తీసుకున్న మోదీ..

భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ టీకాను మోదీ తీసుకున్నారు. మోదీకి ఎయిమ్స్‌ సిస్టర్‌ పి.నివేదా టీకా ఇచ్చారు. టీకా తీసుకున్న సమయంలో అసోంలో తయారు చేసిన గమ్చా(కండువా)ను ధరించి మోదీ కనిపించారు. అసోం మహిళల ఆశీస్సులకు చిహ్నంగా ఆయన ఈ వస్త్రాన్ని ధరించారు. గతంలోనూ చాలా సందర్భాల్లో మోదీ దీన్ని ధరించడం విశేషం. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయన ఉదయాన్నే ఎయిమ్స్‌కు వెళ్లి కొవిడ్‌ టీకా తీసుకున్నారు. ఇక టీకా వేసే సమయంలో కేరళకు చెందిన మరో నర్సు కూడా అక్కడ ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని