ఇంగ్లాండ్‌ మహారాణి, రాజుకు కరోనా టీకా..!
close

తాజా వార్తలు

Updated : 10/01/2021 13:56 IST

ఇంగ్లాండ్‌ మహారాణి, రాజుకు కరోనా టీకా..!

ఇంటర్నెట్‌డెస్క్‌‌: బ్రిటన్‌ రాణి ఎలిజిబెత్‌, రాజు ఫిలిప్‌కు కరోనా టీకా వేసినట్లు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ ప్రకటించింది. ఫిలిప్‌ వయస్సు 99 కాగా.. ఎలిజిబెత్‌ వయస్సు 94. వీరికి ఫ్యామిలీ డాక్టర్‌ విండ్‌సోర్‌ టీకాలు అందజేశారు. లాక్‌డౌన్‌ సమయాన్ని బ్రిటన్ రాజు, రాణి ఇదే ప్యాలెస్‌లో గడిపారు. మార్చి నుంచి అక్టోబర్‌ వరకు అసలు వీరు బయట కార్యక్రమాల్లో కనిపించలేదు. అదే సమయంలో వీరి పెద్ద కుమారుడు ప్రిన్స్‌ చార్లెస్‌ కొవిడ్‌ బారిన పడ్డారు. మనవడు విలియమ్స్‌కు కూడా ఏప్రిల్‌లో కొవిడ్‌ పాజిటీవ్‌గా తేలింది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదని ఆంగ్లపత్రిక బీబీసీ వెల్లడించింది. రాజు, రాణి క్రిస్మస్‌ను మాత్రం బెర్క్‌షైర్‌ రెసిడెన్సీలో జరుపుకొన్నారు.  
కరోనా వ్యాప్తి తర్వాత తొలిసారి కిందటి నెల రాయల్‌ ఫ్యామిలీ సినియర్‌ సభ్యులతో రాణి భేటీ అయ్యారు. బ్రిటన్‌లో ఇప్పటి వరకు 1.5 మిలియన్ల మందికి వ్యాక్సినేషన్‌ చేశారు.  బ్రిటన్‌లో 80ఏళ్లు పైబడిన వారికి తొలి ప్రాధాన్యంలో టీకాలు వేస్తున్నారు. యుకేలో ఇప్పటికే మూడు సంస్థల కొవిడ్‌ టీకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఫైజర్‌-బైయోఎన్‌ఎన్‌టెక్‌, ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనికా, మోడెర్నా టీకాలు ఉన్నాయి. 

ఇవీ చదవండి

డొనాల్డ్‌ ట్రంప్‌ నెత్తిన కత్తి
బైడెన్ ప్రమాణస్వీకారానికి వెళ్లనున్న పెన్స్‌!

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని