కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
close

తాజా వార్తలు

Updated : 03/06/2021 14:59 IST

కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

దిల్లీ: రైతన్నలకు చల్లని కబురు వచ్చేసింది. నైరుతి రుతుపవనాలు నేడు దేశంలోకి ప్రవేశించాయి. ఈ మేరకు రుతుపవనాలు కేరళ దక్షిణ ప్రాంతాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. ఈ రుతుపవనాల ఆగమనంతో దేశంలో వర్షాకాలం మొదలైనట్లు అవుతుంది. ఈ ఏడాది జూన్‌, జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో దేశవ్యాప్తంగా సాధారణ, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. 

వాస్తవానికి జూన్‌ 1నే ఈ రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాల్సి ఉండగా.. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రెండు రోజులు ఆలస్యంగా కేరళను తాకాయి. దీంతో ఆ రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోనూ పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మన దేశంలో దాదాపు సగం కంటే ఎక్కువ వ్యవసాయ భూములు వర్షాధారమైనవే. ప్రధానంగా నైరుతి రుతుపవనాలపైనే ఆధారపడి పంటలు పండిస్తారు. గత రెండేళ్లుగా దేశంలో సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువే ఉందని వాతావరణ శాఖ తెలిపింది.   Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని