పేద దేశాల్లో ఆ టీకా పంపిణీకి WHO పచ్చజెండా..

తాజా వార్తలు

Published : 16/02/2021 11:52 IST

పేద దేశాల్లో ఆ టీకా పంపిణీకి WHO పచ్చజెండా..

జెనీవా: ప్రపంచ వ్యాప్తంగా పేద, వెనుకబడిన దేశాల్లోని కోట్లాది ప్రజలకు కొవిడ్‌ టీకాను అందజేసేందుకు ప్రపంచ దేశాలు, సేవాసంస్థలు.. ప్రపంచ ఆరోగ్య సంస్థతో చేయికలిపిన సంగతి తెలిసిందే. ‘కోవాక్స్’‌ పథకం కింద 92 పేద, మధ్య తరగతి దేశాల్లో కరోనా టీకా పంపిణీ జరగనుంది. కాగా, కోవాక్స్‌ కార్యక్రమం ద్వారా ఆస్ట్రాజెనెకా టీకాలను పంపిణీ చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించింది.

కొవిడ్‌-19 మహమ్మారిని అదుపులోకి తేగలమనే నమ్మకం ఇప్పుడు మరింత పెరిగిందని డబ్ల్యుహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. మిగతా వ్యాక్సిన్‌ రకాలతో పోలిస్తే, ఆస్ట్రాజెనెకా టీకాను నిల్వ చేయటం, తరలించటం సులభం. దీనితో కొవాక్స్‌ పథకం కింద అందజేయనున్న అన్ని డోసులు ఆస్ట్రాజెనెకా తయారు చేసినవే కావచ్చని తెలుస్తోంది.

కాగా ఇప్పటికే 2.4 మిలియన్‌ ప్రజలను పొట్టన పెట్టుకున్న కరోనా నుంచి విముక్తి పొందేందుకు పలు ప్రభుత్వాలు టీకాపైనే తమ నమ్మకాన్ని పెట్టుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 172 మిలియన్‌ డోసుల టీకా పంపిణీ జరిగినప్పటికీ.. వాటిలో అధిక శాతం ధనిక దేశాల్లోనే జరగటం గమనార్హం. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా చర్య.. పేద దేశాలకు కూడా త్వరలోనే కరోనా టీకా లభించగలదనే ఆశాభావాన్ని కలిగిస్తోందని పరిశీలకులు అంటున్నారు.

ఇవీ చదవండి..

చైనా టీకా: పంపిణీ తక్కువ, ఎగుమతి ఎక్కువ

టూల్‌కిట్‌ సూత్రధారులు వారే..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని