
ప్రధానాంశాలు
వివాహేతర సంబంధాలను సైన్యంలో నేరంగానే పరిగణించాలి
కేంద్రం అభ్యర్థనను పరిశీలనకు స్వీకరించిన సుప్రీంకోర్టు
రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు సూచన
దిల్లీ: వైవాహిక బంధంలేని వ్యక్తుల మధ్య ఉండే లైంగిక సంబంధాలను భారతీయ శిక్షా స్మృతి కింద నేరంగా పరిగణించరాదంటూ 2018లో అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సైనిక దళాలకు వర్తింపజేయరాదన్న కేంద్ర ప్రభుత్వ విన్నపాన్ని సుప్రీంకోర్టు పరిశీలనకు స్వీకరించింది. ఈ తీర్పుపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషనర్‌కు బుధవారం జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ కె.ఎం.జోసెఫ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం నోటీసు జారీ చేసింది. న్యాయపరమైన ఈ అంశంలో స్పష్టత కోసం అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్.ఎ.బోబ్డేకు సూచించింది. 2018లో అప్పటి సీజేఐ దీపక్ మిశ్ర నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం... భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్497(వ్యభిచారం)ను కొట్టివేసింది. ఈ తీర్పును పునఃపరిశీలించాలంటూ జోసెష్ షైన్ అనే వ్యక్తి ఇటీవల ప్రజాప్రయోజన వ్యాజ్యం ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర పిటిషన్ దాఖలు చేస్తూ...2018 సుప్రీంకోర్టు తీర్పును సైనిక దళాలకు వర్తింపచేయరాదని కోరింది. దేశరక్షణ విధుల్లో భాగంగా సైనిక సిబ్బంది/అధికారులు తమ కుటుంబాలకు నెలల తరబడి దూరంగా ఉంటారని, అలాంటి సమయంలో వారి భార్యా,పిల్లల రక్షణ బాధ్యతను ఇతర సిబ్బంది/లేదా అధికారులు పర్యవేక్షిస్తుంటారని కేంద్రం తెలిపింది. సైనిక విభాగాల్లో క్రమశిక్షణను నెలకొల్పేందుకు వివాహేతర సంబంధాలను నేరంగానే పరిగణించాలని పేర్కొంది.
ప్రధానాంశాలు
సినిమా
- మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు
- 30ఏళ్లకు కలిసిన ముగ్గురు అన్నదమ్ములు
- కనిపెంచిన చేతులే.. కాటేశాయి
- వద్దు నాన్నా.. అంటున్నా వినకుండా..!
- ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందే: సుప్రీం
- పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్ ఏమన్నారంటే?
- పది మంది భార్యలు.. కోట్ల ఆస్తి.. దారుణ హత్య!
- మళ్లీ జయభేరి మోగిస్తున్నా
- ఎన్నికలను రీషెడ్యూల్ చేసిన ఎస్ఈసీ
- పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
