
ప్రధానాంశాలు
వేడుకకు ఆటంకం కలిగించకూడదు
రైతులకు పోలీసుల సూచన
దిల్లీ: ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతి ఇచ్చిన పోలీసులు గణతంత్ర దినోత్సవానికి ఎటువంటి ఆటంకాలు కలిగించకూడదని రైతులకు సూచించారు. దిల్లీకి వచ్చినా ఉత్సవానికి ఇబ్బందులు కలిగించకూడదని తెలిపారు. అవుటర్ రింగ్ రోడ్డులో ర్యాలీ జరగనున్నప్పటికీ అవసరం మేరకు నగరంలోకి అయిదు కిలోమీటర్ల మేర వచ్చేందుకు వెసులుబాటు కూడా కల్పించారు. ట్రాక్టర్ల సంఖ్య ఆధారంగా దీనిపై నిర్ణయాలు తీసుకుంటారు. గణతంత్ర దినోత్సవానికి భద్రత కల్పించే పోలీసులే దీంట్లోనూ పాల్గొంటారు. ఆ ఉత్సవం పూర్తయిన తరువాత భోజనాలు, కాసేపు విశ్రాంతి ఉంటుందని, ఆ తరువాత ట్రాక్టర్ ర్యాలీకి భద్రత ఇవ్వాల్సి ఉంటుందని సిబ్బందిని ఆదేశించారు. మరోవైపు శాంతియుతంగా ప్రదర్శన జరుపుదామంటూ రైతు నాయకులు పిలుపునిచ్చారు. గణతంత్ర కవాతు ముగిసిన తరువాతనే ర్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు. సింఘు, టిక్రి, ఘాజీపుర్ సరిహద్దుల నుంచి ర్యాలీలు ప్రారంభమవుతాయి. సింఘు నుంచి 62 కి.మీ., ఘాజీపుర్ నుంచి 68 కి.మీ. మేర, టిక్రీ నుంచి 63 కి.మీ. మేర ర్యాలీ సాగుతుందని వివరించారు. చివర్లో తిరిగి బయలుదేరిన చోటుకే చేరుకుంటాయి.
కాంగ్రెస్ ఎంపీపై దాడి
సింఘులో కాంగ్రెస్ ఎంపీ రవనీత్ సింగ్ బిట్టు (లుధియానా)పై కొందరు దాడి చేశారు. తలపాగాను లాగేశారు. వాహనాన్ని ధ్వంసం చేశారు.
ప్రధానాంశాలు
సినిమా
- మాగంటిబాబు కుమారుడి కన్నుమూత
- ఆఫర్ కోసం చిరు, పవన్‌లకు కాల్ చేశా: కోట
- సొంతవాళ్లే నన్ను మోసం చేశారు: రాజేంద్రప్రసాద్
- అఫ్రిది అల్లుడవుతున్న షహీన్
- తెలుగు హీరోయిన్ కోసం బన్నీ పట్టుబట్టాడు
- జూమ్‌కాల్‌లో భోజనం.. విస్తుపోయిన సొలిసేటర్!
- ఆచార్య ఫొటో వైరల్.. ఇలియానా బెంగ
- ఆ సినిమా ఫ్లాప్..నితిన్‌కి ముందే తెలుసు
- ఐపీఎల్ 2021 భారత్‌లో.. అంతా బయటే
- సచిన్ వదిలేశాడు.. ధోనీ అందిపుచ్చుకున్నాడు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
