అన్నాడీఎంకే నేత పన్నీర్‌సెల్వానికి సతీవియోగం

ప్రధానాంశాలు

Published : 02/09/2021 04:37 IST

అన్నాడీఎంకే నేత పన్నీర్‌సెల్వానికి సతీవియోగం

సీఎం స్టాలిన్‌, శశికళ సహా పలువురు నేతల పరామర్శ

చెన్నై (విల్లివాక్కం), న్యూస్‌టుడే:  అన్నాడీఎంకే సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం సతీమణి విజయలక్ష్మి (63) బుధవారం కన్నుమూశారు. గుండెపోటు రావడంతో చికిత్స కోసం ఆమెను చెన్నై పెరుంగుడిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చినా ఫలితం లేకపోయింది. ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం పన్నీర్‌సెల్వాన్ని స్టాలిన్‌ ఓదార్చారు. మంత్రులు దురైమురుగన్‌, తంగం తెన్నరసు, పీకే శేఖర్‌బాబు, మా.సుబ్రమణియన్‌, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ తదితరులు కూడా నివాళి అర్పించిన వారిలో ఉన్నారు. అన్నాడీఎంకే సంయుక్త సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి, జయలలిత నెచ్చెలి శశికళ, తెలంగాణ గవర్నర్‌, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి ఎల్జీ తమిళిసై సౌందరరాజన్‌, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో తదితరులు కూడా పన్నీర్‌సెల్వాన్ని పరామర్శించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన