బైల్స్‌.. కాంస్యంతో టాటా

ప్రధానాంశాలు

Published : 04/08/2021 02:42 IST

బైల్స్‌.. కాంస్యంతో టాటా

టోక్యో: అరడజను స్వర్ణాలు లక్ష్యంగా టోక్యో ఒలింపిక్స్‌లో అడుగు పెట్టిన అమెరికా అగ్రశ్రేణి జిమ్నాస్ట్‌.. చివరికి ఒక టీమ్‌ స్వర్ణం, ఒక వ్యక్తిగత కాంస్యంతో సరిపెట్టుకుంది. ‘ట్విస్టీస్‌’ అనే మానసిక సమస్య కారణంగా టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్‌ నుంచి అర్ధంతరంగా తప్పుకోవడమే కాక, ఆ తర్వాత నాలుగు వ్యక్తిగత ఈవెంట్లకు బైల్స్‌ దూరం కావడం తెలిసిందే. బైల్స్‌ మధ్యలో వెళ్లిపోవడంతో దెబ్బ తిన్న అమెరికా జట్టు టీమ్‌ ఈవెంట్లో రజతానికి పరిమితమైంది. ఆ తర్వాత కూడా బైల్స్‌ కోలుకోకపోవడంతో స్వర్ణాలు ఖాయమనుకున్న నాలుగు వ్యక్తిగత ఈవెంట్లలో బైల్స్‌ పోటీ పడనే లేదు. ఎట్టకేలకు మంగళవారం చివరి వ్యక్తిగత ఈవెంట్‌ బ్యాలెన్స్‌ బీమ్‌ ఫైనల్స్‌లో ఆమె బరిలోకి దిగింది. అందులో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన బైల్స్‌.. కాంస్యంతో సరిపెట్టుకుని టోక్యోకు టాటా చెప్పింది. జిమ్నాస్టిక్స్‌లో క్రీడాకారులు విన్యాసాలు చేస్తున్న సమయంలో ఒకట్రెండు క్షణాల పాటు ఏం చేయాలో పాలుపోనట్లుగా శూన్యం ఆవహించే ‘ట్విస్టీస్‌’ అనే సమస్య వేధిస్తుండటంతో బైల్స్‌ వరుసగా ఒక్కో ఈవెంట్‌ నుంచి తప్పుకుంటూ వచ్చింది. 2016 ఒలింపిక్స్‌లో టీమ్‌ ఈవెంట్‌తో పాటు మరో మూడు ఈవెంట్లలో స్వర్ణాలు, ఒకదాంట్లో కాంస్యం నెగ్గిన బైల్స్‌.. ఈసారి జట్టు పోటీ సహా ఆరు ఈవెంట్లలో ఫైనల్స్‌కు అర్హత సాధించి, అరడజను స్వర్ణాలపై గురి పెట్టింది. కానీ మానసిక అనారోగ్యం కారణంగా ఆమె తీవ్ర నిరాశకు గురి కాక తప్పలేదు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన