close

ప్రధానాంశాలు

Updated : 21/04/2021 10:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఐసీఎస్‌ఈ పదో తరగతి పరీక్షల రద్దు

దిల్లీ: దేశంలో కొవిడ్‌ ఉద్ధృతి పెరుగుతున్న క్రమంలో... ఐసీఎస్‌ఈ పదో తరగతి బోర్డు పరీక్షలు రద్దయ్యాయి. విద్యార్థులు తర్వాత పరీక్షలు రాసే అవకాశాన్ని కూడా ఈ మండలి ఉపసంహరించుకుంది. 10, 12వ తరగతుల పరీక్షలను వాయిదా వేయాలని గతవారం భారత పాఠశాల విద్య ధ్రువీకరణ పరీక్షల మండలి (సీఐఎస్‌సీఈ) నిర్ణయించింది. అయితే, కొవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా 10వ తరగతి బోర్డు పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు బోర్డు కార్యదర్శి జెర్రీ అరాథూన్‌ మంగళవారం వెల్లడించారు. నిష్పాక్షిక, పారదర్శక విధానంలో విద్యార్థుల ప్రతిభను మదింపు వేసి, పదో తరగతి ఫలితాలను ప్రకటిస్తామన్నారు. 12వ తరగతి పరీక్షలు ప్రస్తుతానికి వాయిదా పడ్డాయన్నారు. కాగా, 11వ తరగతి ప్రవేశాలను ప్రారంభించాలని, ఆన్‌లైన్‌ తరగతులకు త్వరితగతిన షెడ్యూలు రూపొందించాలని పాఠశాలలకు సీఐఎస్‌సీఈ సూచించింది.
‘యూజీసీ-నెట్‌’ వాయిదా
విశ్వవిద్యాలయాల నిధుల సంఘం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (యూజీసీ-నెట్‌) వాయిదా పడింది. కరోనా  వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ తెలిపారు. ఈ పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తామన్నది 15 రోజులు ముందుగా ప్రకటిస్తామని జాతీయపరీక్షల సంస్థ పేర్కొంది.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన