విదేశాలకు వెళ్లే విద్యార్థులకు పూనావాలా సాయం

ప్రధానాంశాలు

Published : 06/08/2021 05:36 IST

విదేశాలకు వెళ్లే విద్యార్థులకు పూనావాలా సాయం

క్వారంటైన్‌ ఖర్చులకు రూ.10 కోట్లు

దిల్లీ: కొవిషీల్డ్‌ టీకా వేసుకొని విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల కోసం సీరం సంస్థ సీఈవో అదర్‌ పూనావాలా రూ.10 కోట్లు కేటాయించారు. కొవిషీల్డ్‌ టీకాను పుణెకు చెందిన సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పలు దేశాలు ఆమోదించిన టీకాల జాబితాలో కొవిషీల్డ్‌ను ఇంకా చేర్చలేదు. ఫలితంగా ఈ టీకా తీసుకుని విదేశాలకు వెళ్లే విద్యార్థులు అక్కడ క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తోంది. ఇందుకోసం వారికి అదనంగా ఖర్చవుతోంది. ఈ మేరకు వారికి సాయం చేసేందుకే రూ.10 కోట్లు కేటాయించినట్టు పూనావాలా ట్వీట్‌ చేశారు. విద్యార్థులు సాయం కోసం సంప్రదించాల్సిన లింక్‌ను ట్వీట్‌కు జత చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన