చర్చలకు హాట్‌లైన్‌ పునరుద్ధరిద్దాం

ప్రధానాంశాలు

Published : 27/09/2021 04:25 IST

చర్చలకు హాట్‌లైన్‌ పునరుద్ధరిద్దాం

ఉ.కొరియాను కోరిన ద.కొరియా

సియోల్‌: రెండు దేశాల మధ్య నిలిచిపోయిన హాట్‌లైన్‌ సేవల్ని పునరుద్ధరించుకుందామని ఉత్తర కొరియాను దక్షిణ కొరియా కోరింది. షరతులతో కూడిన చర్చల్ని ప్రారంభిద్దామని ఉ.కొరియా ప్రతిపాదించిన ఒకరోజు వ్యవధిలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రతికూల విధానాలను, ద్వంద్వ ప్రమాణాలను ద.కొరియా విడనాడినట్లయితే అడుగు ముందుకు వేయవచ్చని ఉ.కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ చెబుతున్నారు. అమెరికా ఆంక్షల సడలింపు, సహాయం అందజేత, అణ్వాయుధ దేశంగా అంతర్జాతీయ గుర్తింపు పొందడం వంటి వాటిల్లో ద.కొరియా తోడ్పాటు అందించాలని ఉ.కొరియా ఆశిస్తోంది. ఈ పరిస్థితుల్లో హాట్‌లైన్‌ పునరుద్ధరణ ప్రతిపాదన అంశం తెరపైకి వచ్చింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన