ఉత్తరాదిలో రైళ్లకు అంతరాయం

ప్రధానాంశాలు

Published : 19/10/2021 05:14 IST

ఉత్తరాదిలో రైళ్లకు అంతరాయం

రైతు సంఘాల 6 గంటల రైల్‌రోకో

దిల్లీ, ఈనాడు-లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో రైతులపై దమనకాండను వ్యతిరేకిస్తూ ‘సంయుక్త కిసాన్‌ మోర్చా’ ఇచ్చిన ‘ఆరు గంటల రైల్‌రోకో’ పిలుపు మేరకు సోమవారం పలుచోట్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌ సహా ఉత్తరాదిలో రమారమి 300 రైళ్లు ప్రభావితమయ్యాయి. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతూ పడిగాపులు కాయాల్సి వచ్చింది. పలు జోన్ల పరిధిలో రైళ్లు ఆలస్యంగా నడవడమో, పూర్తిగా రద్దు కావడమో అనివార్యమయింది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న విద్యుదుత్పత్తి కర్మాగారాలకు బొగ్గు తీసుకుని వెళ్తున్న 75 గూడ్సు రైళ్లకూ ఆటంకాలు తప్పలేదు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌, జలంధర్‌, లూధియానా; యూపీలోని ముజఫర్‌నగర్‌, మేరఠ్‌ వంటి చోట్ల రైలు పట్టాలపై రైతులు బైఠాయించారు. రైల్‌రోకో ఆందోళన యూపీలో పలుచోట్ల ఉద్రిక్తతకు దారితీసింది. పలు ప్రాంతాల్లో రైలు సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆదివారం రాత్రి నుంచే పలువురు రైతు నాయకులను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన