మాస్కులు లేకుండా

ప్రధానాంశాలు

Published : 24/07/2021 02:07 IST

మాస్కులు లేకుండా

టోక్యో ఒలింపిక్స్‌ను కరోనా భయం వెంటాడుతూనే ఉంది. క్రీడా గ్రామంలోని అథ్లెట్లకూ పాజిటివ్‌గా తేలుతుండడంతో ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే క్రీడలకు సంబంధం ఉన్న వాళ్లలో 100 మందికి పైగా వైరస్‌ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు మరింత జాగ్రత్త పడుతున్నారు. కానీ ఆరంభోత్సవ వేడుకల్లో కొన్ని దేశాల అథ్లెట్ల తీరు విమర్శలకు తావిస్తోంది. కిర్గిస్థాన్‌, తజికిస్థాన్‌, పాకిస్థాన్‌ అథ్లెట్లు కవాతులో మాస్కుల్లేకుండా కనిపించారు. 15 మంది కిర్గిస్థాన్‌ బృందంలో ఒక్క అథ్లెట్‌ మాత్రమే మాస్కు పెట్టుకున్నాడు. పాకిస్థాన్‌ పతాకాధారులు కూడా మాస్కులు తీసేశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన