Lottery: ఆటోడ్రైవర్‌కు రూ.12 కోట్ల బహుమతి

ప్రధానాంశాలు

Updated : 21/09/2021 15:45 IST

Lottery: ఆటోడ్రైవర్‌కు రూ.12 కోట్ల బహుమతి

కేరళ ఓనం బంపర్‌ లాటరీలో వరించిన అదృష్టం

కోచి: కేరళలో ఓ ఆటోడ్రైవర్‌కు లాటరీలో రూ.12 కోట్ల బహుమతి లభించింది. ఈ మేరకు ఆదివారం ప్రకటించిన ఓనం బంపర్‌ లాటరీ ఫలితాల్లో టీఈ-645465 నంబరు టికెట్‌ బంపర్‌ బహుమతికి ఎంపిక అయింది. ఈ టికెట్‌ను కొనుగోలు చేసిన అదృష్టవంతుడు కోచి సమీపంలో మరాడుకు చెందిన ఆటో డ్రైవర్‌ పీఆర్‌ జయపళన్‌ అని సోమవారం వెల్లడైంది. ‘‘ఈ టికెట్‌ను సెప్టెంబరు 10న త్రిప్పునితురలో కొనుగోలు చేశాను. ఈ నంబర్‌కు బహుమతి లభిస్తుందని అప్పుడే భావించాను’’ అని జయపళన్‌ విలేకరులకు తెలిపారు. రూ.12 కోట్ల బహుమతి మొత్తంలో అన్నిరకాల పన్నులను మినహాయించగా రూ.7 కోట్లకుపైగా ఆయనకు దక్కుతాయి.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన