Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 76291
            [news_title_telugu_html] => 

లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు..

[news_title_telugu] => లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు.. [news_title_english] => Equity indices open in green [news_short_description] => నేడు దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.19 సమయానికి సెన్సెక్స్‌ 226 పాయింట్ల లాభంతో 38,899 వద్ద, నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 11,681 వద్ద ట్రేడవుతున్నాయి. ఆర్‌బీఐ పాలసీ విధాన సమీక్ష [news_tags_keywords] => bse,nse,stockmarket [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => || [news_videoinfo] => || [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-04-01 09:54:46 [news_isactive] => 1 [news_status] => 2 ) )
లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు.. - Equity indices open in green - EENADU
close

తాజా వార్తలు

లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు..

ముంబయి: నేడు దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.19 సమయానికి సెన్సెక్స్‌ 226 పాయింట్ల లాభంతో 38,899 వద్ద, నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 11,681 వద్ద ట్రేడవుతున్నాయి. ఆర్‌బీఐ పాలసీ విధాన సమీక్ష  మార్కెట్లో సానుకూల  అంచనాలు నెలకొనడం, ఉత్పత్తి, సేవా రంగాలకు  సంబంధించి మార్చి నెల డేటా విడుదల కానుండటంతో మార్కెట్‌ జోరు మీదుంది.  ఈ రెండిటి సమాచారం మంగళ, గురువారాల్లో విడుదల కానుంది.  మరోపక్క చైనా అమెరికాల మధ్య చర్చలు కొనసాగుతుండటం కూడా సానుకూల వాతావరణానికి కారణమైంది. రెండు దేశాల మధ్య టారీఫ్‌ వార్‌ ముగిసే అవకాశం ఉందని అమెరికా ఆశాభావం వ్యక్తం చేసింది. 
యూకే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మూడో బ్రెగ్జిట్‌ బిల్లు కూడ ఆమోదం పొందకపోవడంతో మరో బిల్లుతో సోమవారం సభముందుకు రానున్నారు. ఇదే వారంలో ప్రపంచ వ్యాప్తంగా యూరోజోన్‌ ద్రవ్యోల్బణం డేటా, చైనా ఉత్పాదక రంగ డేటా, అమెరికా నిరుద్యోగ డేటా కూడా విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా స్టాక్‌ మార్కె్ట్‌లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. దక్షిణ కొరియా సూచీ 1.1శాతం, జపాన్‌ నిక్కీ 1.6శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.